Tuesday, May 21, 2024

సీత పాత్రలో…

- Advertisement -
- Advertisement -

ఫీల్ గుడ్ మూవీస్‌ను తెరకెక్కించే దర్శకుడు హను రాఘవపూడి మరొకసారి సరికొత్త కథతో ప్రేక్ష కులను అలరించేందుకు సిద్ధమైన సంగతి అందరికీ తెలిసిందే. హీరో దుల్కర్ సల్మాన్‌తో ఆయన త్రిభాష చిత్రం తెరకెక్కిస్తున్నాడు. వైజయంతి మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని అశ్వనీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం లో దుల్కర్ సల్మాన్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో కనిపి స్తున్నారు. కాగా.. ఈ రాముడి సరసన సీతగా బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. అయితే ఆదివారం మృణల్ ఠాకూర్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ సీతకి సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేసింది. అయితే ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ను ప్రకటించలేదు. మృణాల్ ఠాకూర్‌కి ఇది టాలీవుడ్‌లో బిగ్ ఎంట్రీ అని భావించవచ్చు.

Mrunal Thakur play Sita role in Lieutenant Ram

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News