Sunday, April 28, 2024

సంఘటితంగా మున్నూరు కాపులు

- Advertisement -
- Advertisement -

భావితరాలకు అపురూప కానుక గా ఎంకె టవర్
మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్

 

మనతెలంగాణ/ హైదరాబాద్ : మున్నూరు కాపులు అన్ని కులాలతో సన్నిహితంగా ఉంటూ పోటీ తత్వంతో పనిచేస్తారని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం రవీంద్రభారతిలో మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రజాప్రతినిధులు, వివిధ హోదాల్లో పదవులు పొందిన వారికి ఘనంగా సన్మానం చేశారు. మున్నూరు కాపు రాష్ట్ర సంఘం కన్వీనర్ పుట్టం పురుషోత్తమరావు, కో కన్వీనర్ చల్లా హరిశంకర్, ఆర్గనైజర్ కొండ దేవయ్య, అఫెక్స్ కమిటీ చైర్మన్ వద్దిరాజు రవిచంద్ర, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ దండ విఠల్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆకుల లలిత, రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య తదితర అ మున్నూరు కాపు సంఘానికి చెందిన ప్రముఖులను సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు మున్నూరుకాపు అని చెప్తుంటే రాజకీయంగా ఇబ్బందింగా ఉండేదని.. నేడు పేరు పక్కన పటేల్ అని గర్వంగా చెప్పుకుని రాజకీయాల్ని ప్రభావితం చేసే స్థాయిలో మున్నూరు కాపులు ఉన్నారని కొనియాడారు. గ్రామాల్లో మున్నూరు కాపులు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారని వారి మాటను సమాజం వింటుందన్నారు. నగరం నడిబొడ్డున సిఎం కెసిఆర్ రూ.5 కోట్లు ,ఐదు ఎకరాల భూమిని మున్నూరు కాపు ఆత్మ గౌరవ భవనం కోసం కేటాయించారని, పునాదులతో సిద్ధంగా ఉన్న ఈ ప్రాంతంలో ఎంకె టవర్‌ను అతి త్వరలోనే నిర్మించుకుందాం అన్నారు. కార్యక్రమంలో ప్రముఖులు వి ప్రకాష్, పి విఠల్, రౌతు కనకయ్య, గాలి అనిల్‌కుమార్, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన మున్నూరు కాపులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News