Tuesday, May 21, 2024

‘బిలీవ్’తో ‘ఎస్‌పి మ్యూజిక్’

- Advertisement -
- Advertisement -

Music in Suresh production

‘నారప్ప’ మూవీతో తొలిసారి మ్యూజిక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సురేష్ ప్రొడక్షన్స్. ఎస్‌పి మ్యూజిక్ లేబుల్‌పై తొలి చిత్రంగా ‘నారప్ప’ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పారిస్‌కు చెందిన ‘బిలీవ్’ కంపెనీతో ఎస్‌పి మ్యూజిక్ టీమ్‌అప్ అయింది. వీరి భాగస్వామ్యంలో ‘నారప్ప’ మ్యూజిక్‌ను వరల్డ్ మ్యూజిక్ డయాస్‌పై బిలీవ్ ప్రమోట్ చేయనుంది. గతంలో ‘బిలీవ్ ఇండియా’ రానా దగ్గుబాటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ సౌత్ బేతోనూ జట్టు కట్టింది. ఇక బిలీవ్, ఎస్‌పి మ్యూజిక్ భాగస్వామ్యంతో టాలీవుడ్ మ్యూజిక్‌కు కొత్త శకం మొదలైందని చెప్పొచ్చు. ఈ సందర్భంగా ఎస్‌పి మ్యూజిక్ ఎండి, నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ “బిలీవ్‌తో భాగస్వామి అవడం ఎస్‌పి మ్యూజిక్‌కు ప్రారంభంలోనే దక్కిన గొప్ప అవకాశం. బిలీవ్‌కు ఉన్న ప్రపంచ స్థాయి నెట్‌వర్క్‌తో ఎస్‌పి మ్యూజిక్ లేబుల్ వరల్డ్ వైడ్‌గా మ్యూజిక్ లవర్స్‌కు చేరుతుందని ఆశిస్తున్నాం”అని అన్నారు. బిలీవ్ ఇండియా ఎండి వివేక్ రైనా మాట్లాడుతూ సౌతిండియా దిగ్గజ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ సురేష్ ప్రొడక్షన్‌తో భాగస్వామి కావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News