Wednesday, May 1, 2024

గ్రేటర్ పై డెంగీ దండయాత్ర

- Advertisement -
- Advertisement -

భారీగా పెరుగుతోన్న పాజిటివ్ కేసులు
ఆసుపత్రులకు క్యూకడుతున్న రోగులు
జిహెచ్‌ఎంసి దోమల వ్యాప్తి చెందకుండా చూడాలంటున్న వైద్యాధికారులు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలిజా టెస్టుల ద్వారా వ్యాధి నిర్థారణ
ఆందోళన వ్యక్తం చేస్తున్న నగరవాసులు

గ్రేటర్ ఇటీవల కురిసిన భారీ వానలకు వ్యాధులు విజృంభిస్తుండటంతో నగర ప్రజలు ఆసుపత్రుల బాట పడుతున్నారు. గత వారం రోజుల నుంచి డెంగీ, మలేరియా కేసులు నమోదైనట్లు వైద్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉస్మానియా, ఫీవర్, ఆసుపత్రులతో పాటు బస్తీ దవఖానాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స కోసం స్థాని కులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. మొన్నటి వరకు కరోనాతో పోరాటం చేసిన వైద్య సిబ్బంది ప్రస్తుతం సీజనల్ వ్యాధులతో పాటు డెంగీ, మలేరియా వ్యాధుల పెరగడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మన తెలంగాణ/సిటీబ్యూరో: బస్తీ, కాలనీలో రోడ్లపై మురికినీరు నిల్వ ఉండటంతో దోమల దండయాత్ర చేస్తున్నాయని, ఇళ్లలో నీటిసంపులు, ట్యాంక్‌లో వర్షపునీరు ఉంటంతో దోమలు వ్యాప్తి చెంది పగలు, రాత్రి లేకుండా జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని సిబ్బంది పేర్కొంటున్నారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు యాంటీ మస్కిటో స్ప్రేలను చేయించాలని సూచిస్తున్నారు. తా జాగా నగరంలో 230డెంగీ అనుమానిత కేసులు నమోదులో కాగా అందులో 135 మంది పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు చెబుతున్నారు. మరో నెలవరకు డెంగీ కేసులు పెరిగే అవకాశముందని ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు భావిస్తున్నారు. గత నాలుగేళ్లుగా డెంగీ కేసులు పరిశీలిస్తే 2017 సంవత్సరంలో 410 మందికి, 2018లో 263 మందికి సోకగా, 2019లో 1406 మంది, 2020లో 100, ఏడాది జూలై నెలాఖరు వరకు 300 వరకు నమోదు కావచ్చంటున్నారు. నగర ప్రజలు దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలుంటే వెంటనే సమీపంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడంతో స్టిట్ టెస్టులు చేస్తున్నారని, ఈ పద్ధతిలో చాలా వరకు పాజిటివ్ కేసులు వస్తాయని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలిజా టెస్టులు చేస్తారని, లక్షణాలు కనిపించిన వారు సర్కార్ ఆసుపత్రుల్లోనే పరీక్షలు చేయించుకోవాలని, డెంగీను గుర్తించాలంటే ఖరీదైన యంత్ర పరికరాలు వియోగిస్తారని, అలాంటివి పేరు మోసిన కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడ ఉండవని, ప్రజలు ఉస్మానియా, గాంధీ, టిమ్స్ ఆసుపత్రుల్లో డెంగు నిర్థ్దారణ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. గత నెల రోజుల నుంచి విష జ్వరాలు పెరగడంతో నగరవాసులు బస్తీదవాఖానాలు, పట్టణ ఆరోగ్య కే ంద్రాలు పెద్ద ఎత్తున వైద్య చికిత్సల కోసం వస్తున్నట్లు, డెంగీ అనుమానిత కేసులు రావడంతో వైద్యాధికారులు టెస్టుల కోసం పరికరాలు, కాంట్రాక్టు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని వైద్యులు కో రుతున్నారు. వ్యాధులు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఇం టితో పాటు చుట్టుపక్కల వాన నీరు నిల్వకుండా చూడాలని, డయేరియే పట్ల నిర్లక్షం చేయరాదని, శుభ్రమైన నీరు తాగడం, వెచ్చని ఆహారం తీసుకోవాలని, వడపోసిన నీరు తాగడం, తరుచుగా చేతులు కడుకోవడం వంటి పాటించాలని సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News