Sunday, April 28, 2024

మస్క్ ఆఫర్‌ను తిరస్కరిస్తున్నా..

- Advertisement -
- Advertisement -

ట్విట్టర్ ఇన్వెస్టర్, సౌదీ ప్రిన్స్ తలాల్

న్యూయార్క్ : సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానంటూ బిలియనీర్ ఎలోన్ మస్క్ చేసిన బంపర్ ఆఫర్‌ను ప్రధాన వాటాదారుడు, సౌదీ బిలియనీర్ ప్రిన్స్ అల్ వలీద్ బిన్ తలాల్ తిరస్కరించారు. ట్విట్టర్‌లో అతిపెద్ద వాటాదారులలో ఒకరైన తలాల్, మస్కర్ చేసిన 41 బిలియన్ డాలర్ల ఆఫర్‌ను వద్దన్నారు. ‘ఎలోన్ మస్క్ ప్రతిపాదనను నేను పూర్తిగా విశ్వసించబోనని, ట్విట్టర్ అతిపెద్ద దీర్ఘకాల వాటాదారుల్లో ఒకరిగా ఉన్న నేను ఈ ఆఫర్‌ను తిరస్కరించాను’ అని తలాల్ అన్నా రు.

వాక్ స్వేచ్ఛ, మానవ హక్కులను ఉదహరిస్తూ మస్క్ ఈ ప్రతిపాదన చేశారు. మస్క్ చేసి న ఆఫర్ ట్విట్టర్ విలువ కంటె తక్కువ అని కూడా అన్నారు. రియాద్‌లోని కింగ్‌డమ్ హోల్డి ంగ్ కంపెనీకి అధిపతిగా ఉన్న తలాల్ అల్ సౌద్ 2011లో ట్విట్టర్ షేర్లను కొనుగోలు చేశా రు. సౌదీ యువరాజు 1 బిలియన్ డాలర్ల షేర్లనుకలిగి ఉన్నారు. ఈ స్పందనపై మస్క్ స్పం దిస్తూ, రెండు ప్రశ్నలను అడిగారు. ముందుగా మస్క్ ట్విట్టర్‌ను 43 బిలియన్ డాలర్లకు (రూ. 3.2 లక్షల కోట్లు) కొనుగోలు చేస్తానని ఆఫర్ చేశారు. దీని కోసం మస్క్ ఒక్కో షేరుకు 54.20 డాలర్ల చొప్పున అంటే 54 శాతం ప్రీమియంతో నగదు రూపంలో చెల్లించేందుకు సిద్ధమయ్యారు.

100 శాతం వాటాలను మొత్తం 43 బిలియన్ డాలర్లకు తీసుకుంటానని అన్నా రు. కంపెనీ అసాధారణ సామర్థం కల్గివుందని, దానిని తాను అన్‌లాక్ చేస్తానని ప్రపంచంలోనే నంబర్ వన్ కుభేరుడు మస్క్ అన్నా రు. ఈ ప్రకటనతో ట్విట్టర్ షేర్లు మార్కెట్లో 12 శాతం పెరిగాయి. తాను పెట్టుబడి పెట్టినప్పటికీ, ప్రస్తుత రూపంలో ట్విట్టర్ అభివృద్ధి చెందబోదని గ్రహించానని, ట్విట్టర్‌ను ప్రైవేటు కంపెనీగా మార్చాల్సిన అవసరం ఉందని మస్క్ అన్నారు. ‘నా ఆఫర్ ఉత్తమమైంది, ఆఖరిది. దీనికి అంగీకరించకపోతే వాటాదారుడిగా నా స్థానం పున-ఃపరిశీలించుకోవాల్సి ఉంటుం ది’ అని అన్నారు. మస్క్ ఆఫర్‌పై చర్చించడానికి బోర్డు త్వరలో సమావేశం అయ్యే అవకాశముంది. మస్క్ ఇటీవల ట్విట్టర్‌లో 9.2 శాతం వాటాను కొనుగోలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News