Sunday, April 28, 2024

అలరిస్తున్న మాసివ్ టీజర్

- Advertisement -
- Advertisement -

కింగ్ నాగార్జున అక్కినేని మాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నా సామిరంగ’తో సంక్రాంతి పండుగకి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్ బిన్నీ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో యాక్షన్, రొమాన్స్‌తో పాటు ఫ్రెండ్షిప్ కూడా ప్రధాన అంశం. పధాన నటీనటులను పరిచయం చేసి, మొదటి సింగిల్‌ని విడుదల చేసిన తర్వాత, ఇప్పుడు మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ నాగార్జున, అల్లరి నరేష్‌ల స్నేహాన్ని చూపించగా, టీజర్ సినిమాలోని అన్ని ఇతర లేయర్స్‌ని పరిచయం చేసింది.

నాగార్జున గురించి ఆషికా రంగనాథ్, అల్లరి నరేష్ మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణతో టీజర్ ప్రారంభమవుతుంది. కింగ్ నాగార్జున మామిడి తోట ఫైట్ యాక్షన్ సీక్వెన్స్‌తో పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. నాగ్, ఆషికా పదేళ్లుగా మాట్లాడుకోరు. కానీ కళ్లతో పలకరించుకుంటారు. యంగ్ ఏజ్ లో వీరిద్దరి ప్రేమ, నాగ్ తన స్నేహితులైన అల్లరి నరేష్, రాజ్ తరుణ్‌లతో స్నేహం చాలా అద్భుతంగా టీజర్‌లో చూపించారు. ప్రతి సీక్వెన్స్‌ని విజయ్ బిన్నీ ఎక్స్ అద్భుతంగా తీర్చిదిద్దారు. నాగార్జున తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అలరించారు. నాగార్జున గోదావరి యాస చాలా బాగుంది. ఆషికతో అతని కెమిస్ట్రీ అలరించింది. నాగ్, నరేష్, రాజ్ తరుణ్ స్నేహం మరొక ప్రధాన ఆకర్షణ. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News