Saturday, May 4, 2024

‘మాధవే మధుసూదనా’ లుక్‌ను రిలీజ్ చేసిన నాగార్జున

- Advertisement -
- Advertisement -

బొమ్మ దేవర శ్రీదేవి సమర్పణలో సాయి రత్న క్రియేషన్స్ పతాకంపై తేజ బొమ్మ దేవర, రిషిక లోక్రే జంటగా  బొమ్మ దేవర రామచంద్ర రావు దర్శక, నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. పూజా కార్యక్రమానికి హీరో నాగ చైతన్య ముఖ్య అతిథిగా వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలు పెంచేశారు. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. కింగ్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ఈ ఫస్ట్ లుక్‌ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేయించారు మేకర్లు. అనంతరం నాగార్జున మాట్లాడుతూ.. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ బాగుందని, అందరినీ మెప్పించేలా ఉందని ప్రశంసించారు. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

ఇక ఈ మోషన్ పోస్టర్‌లో సంగీతం, ఆర్ఆర్ వినసొంపుగా ఉంది. చూస్తుంటే.. ఈ సినిమాలో అందమైన ప్రేమ కథను తెరపై ఆవిష్కరించబోతోన్నట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమాకు వికాస్ బాడిస అందించిన సంగీతం మేజర్ హైలెట్ అవ్వనున్నట్టుగా కనిపిస్తోంది. వాసు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. ఉద్దవ్ ఎస్ బి ఈ సినిమాకు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్లు ప్రకటించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News