Sunday, April 28, 2024

నాగ్ బర్త్ డే సర్ ప్రైజ్: ‘ది ఘోస్ట్’ మోషన్ పోస్టర్ విడుదల

- Advertisement -
- Advertisement -

Nagarjuna's 'The Ghost' Film first look Released

అక్కినేని నాగార్జున తన అభిమానులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ప్రస్తుతం నాగార్జున, ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఇందులో నాగ్ సరసన కాజల్ కథానాయికగా నటిస్తోంది. అదివారం నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ మోషన్ పోస్టర్ ను హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. ఈ సినిమాకు ది ఘోస్ట్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ పోస్టర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను చిత్రయూనిట్ త్వరలో వెల్లడించనున్నారు.

Nagarjuna’s ‘The Ghost’ Film first look Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News