Sunday, April 28, 2024

కళ్లు చెదిరేలా నల్గొండ ఐటి హబ్

- Advertisement -
- Advertisement -

ఫొటోలు పంచుకున్న కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : నల్గొండ పట్టణంలో నూతనంగా రూపుదిద్దుకున్న ఐటి హబ్ ప్రారంభోత్సవం జరుపుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలను మంత్రి కెటిఆర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. కొత్తగా ప్రారంభమైన నల్గొండ ఐటి హబ్ బహుశా నిర్మాణ పరంగా, కార్యాచరణ పరంగా అత్యుత్తమం అని కొనియాడారు. హైదరాబాదులోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పట్టణాల్లోనూ ఐటి రంగాన్ని విస్తరించాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం నల్గొండలో 2021 డిసెంబరు 31న ఐటి టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. కాగా, నల్గొండ ఐటి హబ్ నుంచి తమ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు ఇప్పటికే 17 సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. తొలుత 1200 మంది ఉద్యోగులను నియమించు కోవాలని ఆయా సంస్థలు భావిస్తున్నాయి.

IT-Hub-2

IT-Hub-3

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News