Sunday, May 12, 2024

కొత్త వ్యవసాయ కళాశాలల్లో 90 సీట్లు

- Advertisement -
- Advertisement -

రిజిస్ట్రార్ డా.వెంకట రమణ

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కొత్త వ్యవసాయ కళాశాల్లో 90సీట్లు భర్తీ చేయనున్నట్టు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ .డా. ఎం వెంకటరమణ ప్రకటించారు.  సిద్దిపేట జిల్లా తోర్నాలలో ఈ విద్యా సంవత్సరంలోనే కొత్త వ్యవసాయ కళాశాలను ప్రారంభించడం జరిగింది. అలాగే కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయము పరిధిలోను ఒక కొత్త కళాశాలను , మహబూబాబాద్ జిల్లా మల్యాల యందు ఏర్పాటు చేయబడినవని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎం. వెంకటరమణ తెలిపారు.

అగ్రికల్చరల్ కాలేజీ తోర్నాలలో 60 సీట్లు , కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, మాల్యాలలో 30 సీట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వీటిని కూడా రెండవ కౌన్సిలింగ్ లో భర్తీ చేస్తామని ప్రకటించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ కళాశాలలను ఎంపిక చేసుకోవచ్చని డాక్టర్ ఎం. వెంకటరమణ వివరించారు. వెటర్నరీ, అగ్రికల్చర్ ,హార్టికల్చర్ అండర్ గ్రాడ్యుయేట్ బై.పీ.సీ స్ట్రీo రెండవ కౌన్సిలింగ్ ను ఈనెల 9 నుండి 13 వరకు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

కొత్త వ్యవసాయ కళాశాల తోర్నాల నందు ఇంకా పూర్తిగా వసతులు లేని కారణంగా, ప్రస్తుతం వ్యవసాయ కళాశాల సిరిసిల్లకు ఎంపికైన అభ్యర్థులను పంపిస్తామని తెలిపారు. తోర్నాల కళాశాలలో వసతులు పూర్తిగా ఏర్పాటు తర్వాత మళ్లీ విద్యార్థులు తిరిగి తోర్నాల కాలేజీకి వస్తారని ఆయన వివరించారు. రెండవ కౌన్సిలింగ్ సంబంధించిన వివరాలు విశ్వవిద్యాలయ వ్బ్సైట్‌లో అందుబాటులో ఉన్నాయని, కౌన్సిలింగ్ లో సీట్ల కేటాయింపు టిఎస్‌ఈఏ ఎంసెట్ -2023 ర్యాంకుల మెరిట్ ,రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా ఉంటుందని డా.వెంకటరమణ వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News