Tuesday, April 30, 2024

గవర్నర్ల తీరును నిరసిస్తాం

- Advertisement -
- Advertisement -

దేశంలో జరుగుతున్న అనేక సమస్యలపై రేపటి వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో బిఆర్‌ఎస్ పెద్ద ఎత్తున చర్చకు పట్టుబడుతుందని ఆ పార్టీ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యు లు నామా నాగేశ్వరరావు చేశారు. ఈ మేర కు సమస్యలపై చర్చ చేపట్టాలని బుధవారం ఢిల్లీ లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కేంద్రాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. యూనిఫామ్ కామన్ సివిల్ కోడ్, మణిపూర్ అంశంపైనా పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. మణిపూర్ అల్లర్లపై ప్రధానమంత్రి స్టేట్‌మెంట్ ఇవ్వాలని.. ఆ అంశంపై చర్చ చేపట్టాలని కోరామన్నా రు. అలాగే గవర్నర్ల అంశంపై కూడా చర్చ చేపట్టాలని కోరామన్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారం లో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ల తీరు వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇందుకు అనేక ఉదాహరణలున్నాయని, ఈ అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరపాల్సిందేనని అఖిలపక్షం సమావేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు.

దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లులకు ఆమోదం తెలపకుండా ఎలా ఇబ్బంది పెడుతున్నారో చూస్తూనే ఉన్నామని చెప్పారు. తమిళనాడులో ఒక మంత్రిని గవర్నర్ తొలగించిన తీరును అఖిల పక్ష సమావేశంలో మాట్లాడామన్నారు.ఈ అంశంలో చర్చ జరగాలని చెప్పామన్నారు. రైతు సమస్యలపై పోరాటం జరిగినప్పుడు కేంద్రం పలు హామీలు ఇచ్చింది.. ముఖ్యంగా రైతులకు మద్దతు ధర సహా ఇతర అంశాలపై చర్చ జరగాలని కూడా కోరామని, నిరుద్యోగ సమస్య, పెరుగుతున్న నిత్యవసర ధరలు, పెండింగ్ లో ఉన్న విమెన్స్ రిజర్వేషన్ బిల్లుపై చర్చ చేపట్టాలని కోరామని, ఈ అంశాలపై బీఆర్‌ఎస్ పార్లమెంట్ సాక్షిగా పోరాడుతుందన్నారు.నిరుద్యోగ సమస్య, ద్రవ్యోల్బణం, ధరలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ, జాతీయ జనగణన అంశాలపై కూడా చర్చ చేపట్టాలని కోరామని, రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పి రిపేర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన అంశాలపైనా కూడా పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీస్తామని అన్నారు.

తెలంగాణ పెండింగ్ అంశాలతోపాటు పెండింగ్ బకాయిలపై కూడా చర్చకు అవకాశం ఇవ్వాలని అఖిల పక్ష సమావేశం లో కోరామని నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, సమస్యల సాధనకు పెద్ద ఎత్తున పార్లమెంట్ సమావేశాల్లో లెవనెత్తుతామన్నారు.తెలంగాణా అభివృద్ధిలో అన్ని అంశాల్లో నెంబర్ వన్ గా ఉందన్నారు. పవర్, ధాన్యం ఉత్పత్తి లోను, తలసరి ఆదాయంలో తెలంగాణా నెంబర్ వన్ గా ఉన్న విషయాన్ని పార్లమెంట్ లో వెలుగెత్తి చాటుతామని చెప్పారు. రైలు ప్రమాదాలపై చర్చ జరుపుతా మన్నారు. కేవలం బిల్లుల ఆమోదానికి సమావేశాల సమయం తక్కువుగా ఇచ్చారని, సమావేశాల గడువు పొడిగించాలని నామా కోరారు తెలంగాణ ఏర్పడిన 9 ఏళ్లలోనే ఎంతో అభివృద్ధి సాధించామని, దేశానికి అనేక అంశాల్లో తెలంగాణా రోల్ మోడల్ గా నిలుస్తుందని నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు.అఖిల పక్ష సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీ పార్లమెంటరీ నేత కే. కేశవరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News