Friday, May 3, 2024

నమీబియా అధ్యక్షులు గింగోబ్ మృతి

- Advertisement -
- Advertisement -

హరారే: నమీబియా అధ్యక్షులు హేజ్ గింగోబ్ ఆదివారం మృతి చెందారు. 82 సంవత్సరాల ఈ నేత స్థానికంగా ఉన్న లేడీ పొహంబా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. గతంలో ఆయనకు క్యాన్సర్ నిర్థారణ అయింది. అమెరికాలో చికిత్స పొందారు. తరువాత కాలేయం, ఇతరత్రా వ్యాధులకు చికిత్సకు ఆసుపత్రిలో చేరారు. ఆయనను కాపాడేందుకు పలు విధాలుగా యత్నించినా ఫలితం లేకుండా పోయిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 2015లో గింగోబ్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.

దీర్ఘకాలికంగా పదవిలో ఉంటూ వస్తున్నారు. మరణం సమయంలో ఆయన భార్య మోనికా గింగోస్, పిల్లలు వెంట ఉన్నారు. దేశ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతల్లో అంగోలో బుంబా ఉన్నారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. తదుపరి కార్యాచరణపై కేబినెట్ సమావేశం జరుగుతుందని వివరించారు. ఈ ఏడాది నవంబర్‌లోనే అధ్యక్ష, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News