Tuesday, May 21, 2024

ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్

- Advertisement -
- Advertisement -

Narasimhapuram movie

గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై పి.ఆర్.క్రియేషన్స్ సమర్పణలో టి.ఫణిరాజ్ గౌడ్-, నందకిశోర్ ధూళిపాలతో కలిసి శ్రీరాజ్ బళ్లా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘నరసింహపురం’. నందకిశోర్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 30 న విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. సిరి హనుమంతు హీరోయిన్‌గా నటించగా.. వర్ధమాన నటి ఉష ఈ చిత్రంలో హీరో చెల్లెలు పాత్రలో నటి ంచారు. ఈ వేడుకలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, హీరో శ్రీకాంత్, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సమీర్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్ర కథానాయకుడు నందు, దర్శకుడు శ్రీరాజ్ బళ్లా, నిర్మాత ఫణిరాజ్ గౌడ్, ఉష తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. థియేటర్ ట్రైలర్ ను విడుదల చేసిన ముఖ్య అతిధులు ’నరసింహపురం’ పెద్ద విజయం సాధించి చిత్రబృందానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇక ‘నరసింహపురం‘ ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు దర్శకనిర్మాతలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News