Saturday, April 27, 2024

డ్రైవర్ లేని ట్రైన్‌ను ప్రారంభించనున్న ప్రధాని

- Advertisement -
- Advertisement -

Narendra Modi To Flag Off First Driverless Train

న్యూఢిల్లీ : భారతదేశపు తొట్టతొలి డ్రైవర్ రహిత మెట్రో రైలు ఈ నెల 28వ తేదీన ప్రారంభం కానుంది. ప్రధాని మోడీ దీనికి పచ్చజెండాతో పరుగులు తీయిస్తారు. జనక్‌పురి వెస్ట్ నుంచి బొటానికల్ గార్డెన్ వరకూ 37 కిలోమీటర్ల మేర మాగ్నెటా లైన్‌లో ఈ రైలు ప్రయాణం సాగుతుంది. ఈ వినూత్న రైలు సర్వీసు వివరాలను ఢిల్లీ మెట్రోరైలు విభాగం ఉన్నతాధికారి అనుజ్ దయాళ్ శుక్రవారం తెలిపారు. డ్రైవర్ లేకుండా రైలు నడిపే సాంకేతిక ప్రక్రియను సంతరించుకోవడం మెట్రో రైలు వ్యవస్థలో కీలక పరిణామం అయింది. రైలు పట్టాలపై లోపాలు, అడ్డంకులు ఉంటే గుర్తించేందుకు అత్యంత శక్తివంతమైన కెమెరాలు ఏర్పాటు చేశారు.డ్రైవర్ రహిత రైళ్ల నిర్వహణకు సంబంధించి రైల్వే భద్రతా కమిషనర్ (సిఎంఆర్‌ఎస్) పలు నిర్థిష్ట షరతులు విధించింది. వీటన్నింటికి సంబంధించి ఢిల్లీ మెట్రో రైలు వ్యవస్థ నుంచి సంతృప్తికరమైన వివరణలు, ప్రాక్టికల్‌గా వీటిని నిరూపించుకున్న తరువాతనే ఈ డ్రైవర్ లెస్ ట్రైన్‌కు అనుమతిని ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News