Thursday, May 16, 2024

ఎండల వేడికి మండుతోన్న ఇంగ్లాండ్

- Advertisement -
- Advertisement -

తొలిసారి ‘ఎమర్జెన్సీ’ ప్రకటన

లండన్ : గత కొన్నిరోజులుగా బ్రిటన్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వడగాల్పులు వీస్తుండడంతో బ్రిటన్ వాతావరణ విభాగం అప్రమత్తమై తొలిసారి రెడ్ వార్నింగ్ జారీ చేసింది. లండన్‌తోపాటు ఇంగ్లాండ్ లోని పలుప్రాంతాల్లో వచ్చే కొన్ని వారాల పాటు ఇదే రకమైన ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో జాతీయ అత్యయిక స్థితిని ప్రకటించిన అధికారులు , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఉష్ణోగ్రతలు అత్యధికంగా 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరువవుతుండటం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని బ్రిటన్ వాతావరణ విభాగం పేర్కొంది. అధిక ఉష్ణోగ్రతల ప్రభావం సున్నిత మైన వ్యవస్థలైన విద్యుత్, అత్యవసర సేవలైనట్వుంటి నీరు, మొబైల్ ఫోన్ సర్వీసులపై పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం పేర్కొంది. మరోవైపు బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ కూడా అత్యంత తీవ్రమైన నాలుగో అలర్ట్‌ను ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News