Saturday, April 27, 2024

తెలంగాణ మోడలే దేశానికి రక్ష

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ పథకాలపై
జాతీయస్థాయిలో చర్చోపచర్చలు

అభివృద్ధి, సంక్షేమం తీరుతెన్నులపై మేథావుల అధ్యయనం
తెలంగాణ పథకాలు దేశవ్యాప్తం కావాలంటున్న రైతు నేతలు
జీవ నదులు ఉన్నా తాగు, సాగు నీరుకు ఇంకా కటకటే ఇప్పటికీ
అంధకారంలో ఆరు లక్షల గ్రామాలు ధనవంతులు పెరుగుతున్నా
దారిద్య్రాన్ని పారద్రోలలేకపోయిన జాతీయ పార్టీలు

మన తెలంగాణ/హైదరాబాద్: దేశానికి స్వా తంత్య్రం సిద్ధ్దించి 75ఏళ్లు గడచినప్పటికీ ఆశించిన మేరకు అభివృద్ధి, సంక్షేమం జరగకపోవడంతోనే మేధావివర్గం తెలంగాణ రాష్ట్రంలో అ మలవుతున్న పథకాలపైనే జాతీయస్థాయిలో చ ర్చోపచర్చలు జరుపుతోంది. తెలంగాణ పథకాల పై అధ్యయనాలు చేస్తున్నారు. జాతీయస్థాయిలో ఉన్న రైతు సంఘాల నాయకుల ప్రతినిధి బృం దాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, అవి అమలవుతున్న తీ రుతెన్నులను స్వయంగా పరిశీలించేందుకు రా ష్ట్రంలో బృందాలు బృందాలుగా పర్యటనలు చే స్తున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్దించి కేవలం ఏ డేళ్ల కాలంలోనే ఒక కోటి 35 లక్షల ఎకరాలకు సాగునీరు, ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటి సరఫరా చేస్తుండటం వంటి పథకాలు దేశంలో ఎక్క డా, ఏ రాష్ట్రంలోనూ లేకపోవడం, తెలంగాణలో వ్యవసాయానికి నిరంతరం 24 గంటల నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా సరఫరా చే స్తుండడం, ఇలాంటి పథకం దేశంలో మరెక్కడా లేకపోవడం, రైతుబంధు పథకంతో రైతాంగానికిసాగు పెట్టుబడిగా 58 వేల కోట్ల రూపాయల నిధులను పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యవసాయ నిపుణులు స్వామినాధన్ వంటివారు కొనియాడిన అంశాన్ని గుర్తుచేస్తున్నారు.

ఈ పథకాలు ఇటు కేంద్రానికి, అటు ఇతర రాష్ట్రాలకూ రోల్‌మోడల్‌గా నిలవడంతో ఇలాంటి పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయడం కోసమైనా దేశ రాజకీయాల్లోకి రావాలని జాతీయ రైతు సంఘాల నాయకులు, కొన్ని పార్టీల జాతీయ నాయకులు కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్.ను కోరడంతో దేశానికి తెలంగాణ మోడల్ ఆవశ్యకత ఉందని, అందుకే టి.ఆర్.ఎస్.పార్టీని జాతీయస్థాయిలో రాజకీయ పార్టీగా చేసేందుకు వీలుగా పార్టీ పేరును మార్చేందుకు నిర్ణయం తీసుకొన్నట్లుగా పార్టీ నేతలు వివరించారు. వాస్తవానికి దేశంలో వ్యవసాయానికి పనికివచ్చే భూములు ఏకంగా 41 కోట్ల ఎకరాలున్నాయని, అందులో ప్రస్తుతం పంటలు పండిస్తున్నది కేవలం 19 కోట్ల ఎకరాల్లో మాత్రమేనని, ఇంకనూ 22 కోట్ల ఎకరాల భూములను సాగులోనికి తీసుకొస్తే ప్రపంచంలోని అన్ని దేశాలకూ ఆహారపదార్ధాలను ఎగుమతులు చేసే అవకాశాలు ఉండేవని, ఆ పనిచేయడంలో ఇప్పటి వరకూ దేశాన్ని పాలించిన పార్టీలు ఆ దిశగా ఎన్నడూ ఆలోచన చేయలేదని పలువురు రాజకీయ విశ్లేషకులు, నిపుణులు అంటున్నారు.

ప్రస్తుతం ప్రపంచంలోని 120 దేశాలకు ఆహారధాన్యాలను ఎగుమతి చేస్తున్నామని, అది కూడా కేవలం 50 బిలియన్ డాలర్లకు మాత్రమే పరిమితంగా ఉన్నామని, వాస్తవానికి 250 బిలియన్ డాలర్ల విలువైన ఆహారధాన్యాలను ఎగుమతులు చేసే సత్తా భారత దేశ రైతాంగానికి ఉందని, కానీ ఈ రంగాన్ని దేశాన్ని పాలించిన ఏ ఒక్క రాజకీయపార్టీ కూడా పట్టించుకోలేదని నిపుణులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అంతేగాక దేశంలో 400 నదులు, ఎనిమిది భారీ నదులు (జీవనదులు) ఉన్నాయని, ఈ నదుల్లో ఏకంగా 72 వేల టి.ఎం.సీ.ల నీరు అందుబాటులో ఉందని, ఈ నీటిని వినియోగంలోనికి తీసుకొస్తే దేశంలోని 145 కోట్ల మంది ప్రజలకు సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయవచ్చునని, దీనికితోడు 22 కోట్ల ఎకరాల భూములకు కొత్తగా సాగునీటిని సరఫరా చేయవచ్చునని నిపుణులు గంణాంకాలతో సహా వివరించారు.

ఇప్పటికీ ప్రపంచంలోని ఆఫ్రికా దేశాలు, దక్షిణ అమెరికా దేశాలు, కొన్ని ఆసియా దేశాల్లో ఆహార కొరత సమస్యలు కొన్ని కోట్ల మంది ప్రజలను పీడిస్తున్నాయని, అలాంటి దేశాలకు ఆహార ధాన్యాలను ఎగుమతులు చేస్తే దేశంలోని రైతాంగానికి గిట్టుబాటు ధరలే కాకుండా వ్యవసాయం ఎంతో లాభసాటిగా ఉండే విధంగా ఆచరణయోగ్యమైన ప్రణాళికలతో అభివృద్ధి చేసుకోవాల్సిందిపోయి ఎల్లప్పుడూ గద్దెనెక్కిన సీటును కాపాడుకోవడానికి, అక్రమ సంపాదనలకే దేశాన్ని పాలించిన పార్టీలు పరిమితమయ్యాయేగానీ తెలంగాణ రాష్ట్ర పాలకుల మాదిరిగా ప్రగతిశీలంగా ఆలోచన చేయలేదని వ్యవసాయ నిపుణులు, రైతు సంఘాల నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

అంధకారంలో 6 లక్షల గ్రామాలు

దేశాన్ని పాలించిన పార్టీలు ప్రజలపట్ల ఎంతటి నిర్లక్షంగా ఉన్నారంటే… ఏకంగా 5,97,464 గ్రామాలు (సుమారు 6 లక్షలు) ఇప్పటికీ అంధకారంలో ఉన్నాయని, ఆ గ్రామాలకు కనీసం విద్యుత్తు సరఫరా కూడా లేదని, కరెంటు బల్బు ఎలా ఉంటుందో కూడా ఆ గ్రామాల ప్రజలకు తెలియదని మేధావులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ ఒక్క ఉదాహరణే దేశాన్ని పాలించిన పార్టీలకు అభివృద్ధి, సంక్షేమం పట్ల ఏపాటి చిత్తశుద్ది ఉందో తెలుసుకోవచ్చునని అంటున్నారు. దేశ ప్రజలకు, వ్యవసాయ రంగానికి తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా ఉచితంగా విద్యుత్తును సరఫరా చేయాలన్నా, అన్ని గ్రామాలకు విద్యుత్తును సరఫరా చేయడానికి, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడానికి, బహుళజాతి కంపెనీల నుంచి పెట్టుబడులను రాబట్టుకోవాలన్నా నిరంతరం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసే సామర్ధం ఉండాలని, కానీ అది లేకపోవడం దేశ ప్రజల దుదృష్టమని మదనపడుతున్నారు. ఈ లెక్కన విద్యుత్తు ఉత్పత్తి సామర్ధం కనీసం 10లక్షల మెగావాట్లు ఉండాలని, కానీ దేశంలో ఇప్పటికీ కేవలం 4,05,773 మెగావాట్లు మాత్రమే ఉందని, ఈ కొద్దిపాటి విద్యుత్తు ఏ పాటి సరపోతుందని విమర్శిస్తున్నారు. నీరు, విద్యుత్తు రంగాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తేనే దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందనే మౌలిక సూత్రాన్ని కూడా దేశాన్ని పాలించిన ఏ ఒక్కపార్టీ కూడా పట్టించుకోలేదని అంటున్నారు.

దేశం వదిలి పారిపోతున్న ధనవంతులు

కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగాలకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న లోపభూయిష్ట విధానాల మూలంగా ధనవంతులు సైతం దేశం వదిలి పారిపోయి విదేశాల్లో సెటిల్ అవుతున్నారని, భారతీయ పౌరసత్వాన్ని కూడా వదులుకొని విదేశాల్లో పౌరసత్వాలు సంపాదించుకొంటున్నారని కేంద్ర విదేశాంగశాఖ పార్లమెంటుకు లిఖితపూర్వకంగా ఇచ్చిన జవాబులే స్పష్టంచేస్తున్నాయని మేధావులు, నిపుణులు మండిపడుతున్నారు. గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ రిపోర్ట్ ప్రకారం 2014వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ 23 వేల మంది బిలియనీర్లు, మిలియనీర్లు భారతదేశాన్ని శాశ్వతంగా విడిచిపెట్టారు. అదే విధంగా 2021వ సవత్సరంలో పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఐ.టి.ఇంజనీర్లు, డాక్టర్లు తదితర రంగాలకు చెందిన వారు ఒక లక్షా 63 వేల మంది అమెరికా, యు.కే., గల్ఫ్ దేశాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా వంటి దేశాలకు వలస వెళ్ళారని ఆ నివేదిక స్పష్టం చేసింది.

దేశంలో అమలవుతున్న పన్నుల విధానం, ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన అవినీతి, పరిశ్రమల స్థాపనకు జరుగుతున్న అంతులేని జాప్యం, అనుమతులు ఇవ్వడానికి లంచాలు మాత్రమే కాకుండా కొన్నికొన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాల పెద్దలు తమతమ కంపెనీల్లో వాటాలు కావాలని డిమాండ్ చేస్తుండటం వంటి రకరకాల కారణాలతోనే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దేశం విడిచి పారిపోతున్నారని, ఇదీ దేశాన్ని పాలిస్తున్న పార్టీలు, నేతల ఘనకీర్తి అని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటివి ఎన్నో రంగాల్లో దేశం అభివృద్ధి చెందకపోగా తిరోగమనంలో పయనిస్తోందని మేధావులు, ఆయా రంగాల నిపుణులు మండిపడుతున్నారు. ఇలాంటి దుర్భరపరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఐ.టి.కంపెనీలు, ఫార్మారంగాలు భారీగా అభివృద్ధి చెందాయని, ఈ రెండు రంగాల్లో కలిపి సుమారు 36 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయని వివరించారు.

ఇటు వ్యవసాయ రంగం, పరిశ్రమలు, ఐ.టి, ఫార్మా, ఉన్నత విద్యా రంగం, వైద్య సదుపాయాలు, పర్యాటక రంగం చివరకు క్రీడా రంగంలోనూ తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి చూస్తుంటే దేశానికి తెలంగాణ మోడల్ (నమూనా) పరిపాలన కావాలని, అందుకే ముఖ్యమంత్రి కె.సి.ఆర్.ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని నిపుణులు, మేధావులు కోరుతున్నారని, దానికి తగినట్లుగానే కొన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా కె.సి.ఆర్.ను ఆహ్వానించడం, అందుకు తగినట్లుగా ముఖ్యమంత్రి కె.సి.ఆర్.కూడా రాష్ట్రానికే కాకుండా దేశానికి ప్రాతినిధ్యం వహించే విధంగా రాజకీయ పార్టీని విస్తరించాలని నిర్ణయించడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని వ్యవసాయ నిపుణులు, మేధావులు, రైతు సంఘాల జాతీయ నాయకులు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News