Friday, May 3, 2024

అనాథ పిల్లలకు హైజెనిక్ కిట్లు

- Advertisement -
- Advertisement -

Navdeep donates hygiene kits to orphans

సైబరాబాద్ సిపి సజ్జనార్‌కు అందజేసిన సినీ నటుడు నవదీప్

హైదరాబాద్: అనాథ పిల్లలకు అందించేందుకు సినీనటుడు నవదీప్ హైజెనిక్ కిట్లను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్‌కు అందజేశారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం సిపి సజ్జనార్‌ను కలిసి కిట్లను అందజేశారు. సైబరాబాద్ పోలీసుల సహకారంతో అనాథ పిల్లలకు 350కిట్లను అందజేయనున్నట్లు సినీ నటుడు నవదీప్ తెలిపారు. కిట్‌లో బాతింగ్ సోప్, డెటాల్, సానిటైజర్, టెట్రా మిల్క్ ప్యాకెట్, టూత్ బ్రష్ తదితరాలతో కూడిన కిట్లను అందజేశారు. అనాథ పిల్లలకు తన వంతుగా చిన్న సాయం చేస్తున్నట్లు నవదీప్ తెలిపారు. అనాథ పిల్లలకు కిట్లు దానం చేసిన నవదీప్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అభినందించారు. కార్యక్రమంలో డిసిపిలు రోహిణి, అనసూయ, ఎడిసిపి సందీప్ పాల్గొన్నారు.

Navdeep donates hygiene kits to orphans

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News