Sunday, April 28, 2024

బ్రిటిష్ ఫ్యాషన్ కౌన్సిల్ అంబాసడర్‌గా ప్రియాంక చోప్రా నియామకం

- Advertisement -
- Advertisement -

Priyanka Chopra as Ambassador of British Fashion Council

ముంబయి: సానుకూల మార్పునకు సంబంధించి రాయబారి(అంబాసడర్‌గ)గా తనను బ్రిటిష్ ఫ్యాషన్ కౌన్సిల్(బిఎఫ్‌సి) నియమించినట్లు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జోనాస్ మంగళవారం ప్రకటించారు. భవిష్యత్ తరాలలో స్ఫూర్తినింపేందుకు ఒక సానుకూల వేదికగా ఫ్యాషన్‌ను ఉపయోగించేందుకు బిఎఫ్‌సి చేస్తున్న కృషిలో తాను కూడా భాగస్వామిని అవుతానని ట్విట్టర్ వేదికగా ఆమె ప్రకటించారు.  సానుకూల మార్పు కోసం బ్రిటిష్ ఫ్యాషన్ కౌన్సిల్ రాయబారిగా చేరుతున్నందుకు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నానని, పాప్ సంస్కృతికి ఫ్యాషన్ ఎప్పుడూ ఊపిరిలాంటిదని, విభిన్న సంస్కృతులను అనుసంధానించి, ప్రజలను ఒక దగ్గరకు చేర్చే శక్తి ఫ్యాషన్‌కు ఉందని ప్రియాంక చోప్రా పేర్కొన్నారు. తమ సంస్థ అంబాసడర్‌గా ప్రియాంక చోప్రాను నియమించడం పట్ల బిఎఫ్‌సి చీఫ్ ఎగ్జిక్యుటివ్ కరోలిన్ రష్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏడాది నవంబర్ నుంచి వచ్చే ఏడాది డిసెంబర్ వరకు జరిగే వివిధ ఫ్యాషన్ ఈవెంట్లలో ఆమె పాల్గొంటారు. ఇందులో లండన్ ఫ్యాషన్ వీక్, ఫ్యాషన్ అవార్డ్ తదితర అనేక బిఎఫ్‌సి ఈవెంట్లు ఉన్నాయి.

Priyanka Chopra Jonas British Fashion Council Ambassador

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News