Tuesday, May 7, 2024

నాది వైల్డ్ క్యారెక్టర్

- Advertisement -
- Advertisement -

మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘మోనగాళ్లు’. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్, సునీల్ శెట్టి, నవదీప్, నవీన్‌చంద్ర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా నవీన్‌చంద్ర మాట్లాడుతూ.. “నిజంగా జరిగిన కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. అమెరికాలో జరిగిన ఓ పెద్ద కుంభకోణం నేపథ్యంలో దర్శకుడు జెఫ్రీ గీ చిన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక మంచి కథలో భాగం కావాలని ఈ సినిమా చేశాను. ఈ చిత్రంలో విష్ణు, కాజల్‌కు కజిన్‌గా నటించాను. వాళ్లకు ఏది కావాలంటే అది చేయగలిగే పాత్ర చేశా. నాది వైల్డ్ క్యారెక్టర్. డ్రగ్స్, మద్యం లేకుండా ఉండలేని పాత్ర ఇది. ‘మోసగాళ్లు’ నా కెరీర్‌లో ఓ స్పెషల్ మూవీగా నిలుస్తుంది” అని అన్నారు.

Naveen Chandra to play Wild Character in Mosagallu

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News