Saturday, May 18, 2024

ఛాలెజింగ్ రోల్ చేస్తున్నా

- Advertisement -
- Advertisement -

Nayana thara act in Blind film

దక్షిణాది లేడీ సూపర్ స్టార్‌గా పేరొందిన నయనతార.. ప్రస్తుతం తమిళ్, తెలుగు ఇండస్ట్రీలో భారీ సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ ఇంకా తన హవాను కొనసాగిస్తోంది. అలాగే భారీ పారితోషికం కూడా అందుకుంటోంది. దాదాపు పదమూడేళ్లకు పైగా దక్షిణాది సినిమాలలో నటిస్తూ సినీ ప్రియులను అలరిస్తోంది ఈ భామ. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యమిచ్చిన నయన్.. కొన్నేళ్లుగా తన పంథా మార్చేసింది. గ్లామర్ షో తగ్గించేసి నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేసుకుంటూపోతోంది. తాజాగా నయనతార నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ నెట్రికన్. కొరియన్ మూవీ ‘బ్లైండ్’కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఫస్ట్ టైం నయనతార ఈ సినిమాలో అంధురాలిగా కనిపించనుంది. అయితే తొలిసారి ఈ అమ్మడు ఓ ఛాలెంజింగ్ రోల్ ప్లే చేసినట్లు తెలిపింది. కళ్లు లేని అమ్మాయి ఓ సీరియల్ కిల్లర్‌ను ఎలా పట్టుకుంది.. అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించాడు ‘గృహం’ ఫేమ్ డైరెక్టర్ మిలింద్ రౌ. మర్డర్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా టీజర్ గత ఏడాది నవంబర్‌లోనే విడుదలై సినిమాపై అంచనాలు పెంచేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News