Sunday, May 5, 2024

అంబులెన్స్‌కు దారి ఇచ్చి.. ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్

- Advertisement -
- Advertisement -

Netizens praise Constable for save life

 

మనతెలంగాణ, హైదరాబాద్ : ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్ ముందుకు వెళ్లేలా చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నగరంలో మొజంజాహి మార్కెట్ నుంచి కోఠి వెళ్లే దారిలో ఓ అంబులెన్స్ వచ్చి ట్రాఫిక్‌లో చిక్కుకుంది. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ బాబ్జి. వెంటనే అంబులెన్స్‌కు దారి క్లియర్ చేసి ప్రాణాలు కాపాడాలనుకున్నాడు. వెంటనే అంబులెన్స్ ముందు పరిగెడుతూ దాని ఎదురుగా ఉన్న వాహనాలను పక్కకు తప్పించి రహదారిని క్లియర్ చేశాడు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న బాధితుడు సకాలంలో ఆస్పత్రికి చేరుకోవడంతో ప్రాణగండం నుంచి బయటపడ్డాడు. ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ సహాయానికి కృతజ్ఞతగా దానికి సంబంధించిన వీడియోను బాధిత కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో పెట్టారు. దీనిని చూసిన నెటిజన్లు కానిస్టేబుల్ సమయస్ఫూర్తికి ప్రశంసలు కురిపిస్తున్నారు. పోలీస్ ఉన్నతాధికారులు కూడా కానిస్టేబుల్‌ను అభినందించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News