Monday, April 29, 2024

అంగన్‌వాడీలకు కొత్త భవనాలు….

- Advertisement -
- Advertisement -

వచ్చే ఏడాదిలో తీరనున్న అద్దె భవనాల సమస్యలు
ఐసిడిఎస్ అధికారులకు నివేదికలు ఇవ్వాలని ప్రభుత్వం సూచనలు
వచ్చే ఏడాదిలో సొంత భవనాలు సిద్ధం చేయాలని కోరుతున్న టీచర్లు

మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలో పిల్లలకు, బాలింతలకు, గర్భిణీలకు పౌష్టికాహరాన్ని అందిస్తూ పేదల నుంచి మహిళ శిశు సంక్షేమ శాఖ ప్రశంసలు పొందుతుంది. స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత అంగన్‌వాడీ టీచర్లకు మూడు పర్యాయాలు వేతనాలు పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. అదే విధంగా చాలా అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు. దీంతో నెలవారీ అద్దెలు చెల్లించకపోవడంతో చాలా సెంటర్లు మూతపడిన రోజులున్నాయి. చాలా సార్లు అంగన్‌వాడీ సిబ్బంది సొంత భవనాలు నిర్మించాలని కోరడంతో ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటికి సంబంధించిన వివరాలు సేకరించి వీలైనంత త్వరగా నివేదికలు ఇవ్వాలని సూచించినట్లు చెబుతున్నారు.

తెలంగాణలో మొత్తం అంగన్వాడీ కేంద్రాలు 35,700 ఉండగా ఇందులో ప్రధాన అంగన్‌వాడీలు 31,711 కాగా, మినీ అంగన్‌వాడీలు 3,989 ఉన్నాయి. అందులో ప్రధాన అంగన్ వాడీ కేంద్రాలకు ప్రతి నెల మెయింటెన్స్ కింద రూ. 2 వేలు ఇస్తుండగా, మినీ అంగన్వాడీ కేంద్రాలకు రూ. 1000 ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ 12,221 అంగన్ వాడీ కేంద్రాలు ఇంకా అద్దె భవనాల్లోనే కొనసాగుతాయి. వీటిలో 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు సూక్ష్మ పోషకాలతో ఫోర్టిపైడ్ చేయబడిన రోస్ట్ గోధుమలు, వేయించిన శనగపప్పు, పాలపొడి, చెక్కర, ఆయిల్, మెత్తగా పొడి చేసిన బాలామృతం పంపిణీ చేస్తున్నారు. ఒక్కొక్క లబ్ధిదారునకు, ఒక్క రోజుకి 100 గ్రాముల చొప్పున 25 రోజులకు ప్రతినెల మొదటి రోజున రెండున్నర కిలోల ప్యాక్ పంపిణీ, వారానికి 4 చొప్పున నెలకి 16 గ్రుడ్లు అందిస్తున్నారు. 3 సంవత్సరముల నుంచి 6 సంవత్సరాల పిల్లలకు అంగన్ వాడీ కేంద్రంలో ప్రతిరోజు (75 గ్రా బియ్యం, 15గ్రా పప్పు, 5గ్రా ఆయిల్, 25గ్రా కూరగాయలతో) వేడి భోజనం వడ్డిస్తున్నారు.

అదే విధంగా 20 గ్రాముల స్నాక్స్ ప్రతి రోజు వారానికి 4 గ్రుడ్లు చొప్పున నెలకి 16 గ్రుడ్లు ఇస్తున్నట్లు అంగన్‌వాడీ టీచర్లు వెల్లడించారు. గర్భిణీలు, బాలింతలకు ఒక సంపూర్ణ భోజనం 150 గ్రాముల అన్నం, 30 గ్రాముల పప్పు, 16 గ్రాముల ఆయిల్, 50 గ్రాముల ఆకుకూరలతో పాటు 200మి,లీ పాలు, ఒక గ్రుడ్డు ప్రతిరోజు అంగన్ వాడీ కేంద్రం వద్ద పంపిణీ చేస్తున్నారు. ఇంతవరకు అంతా భాగానే ఉన్న అద్దెభవనాల విషయంలో అంగన్‌వాడీ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం అద్దె సమస్యలు లేకుండా ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలు, లేనిచోట ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారు. ఈ సమస్య త్వరలో తీరనున్నదని మహిళా, శిశుసంక్షేమ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News