Sunday, April 28, 2024

క్యాన్సర్‌కు కొత్త మందు… ఆ చిన్నారి పేరు మీదుగా

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : క్యాన్సర్‌కు అమెరికా పరిశోధకులు ఒక కొత్త మందును రూపొందించారు. దీనికి ఏవోహెచ్ 1996 అని నామకరణం చేశారు. ఇది ఒక చిన్నారి పేరు. చివరి అంకెలు ఆమె పుట్టిన సంవత్సరానికి గుర్తుగా పెట్టినట్టు అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికాలో ఏడాదికి 600 మంది చిన్నారులు క్యాన్సర్ బారిన పడుతున్నారు. వారిని ఎంతోప్రభావితం చేస్తోన్న న్యూరో బ్లాస్టోమాను నివారించడానికి ఈ మందు కనుగొన్నారు. అన్నా ఒలివియా హీలీ అనే చిన్నారి 1996లో ఇండియానాలో జన్మించింది.

బాలికకు న్యూరో బ్లాస్తోమా వచ్చింది. క్యాన్సర్‌తో ఎంతో పోరాడి తన తొమ్మిదో ఏట ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరణానికి దిగ్భ్రాంతి చెందిన పరిశోధకులు ఇలాంటి పరిస్థితి మరే చిన్నారికి రాకూడదనే ఉద్దేశంతో ఈ మందును తయారు చేశారు. అయితే దీనిని రూపొందించడానికి రెండు దశాబ్దాలకు ముందే పరిశోధనలు మొదలుపెట్టినట్టు వెల్లడించారు. ఎఒఎహ్ 1996 అన్ని రకాల క్యాన్సర్ కణతులను నిర్మూలిస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం కాలిఫోర్నియా లోని సిటీ ఆఫ్ హోప్ హాస్పిటల్ లో ఈ ఔషధానికి మొదటి ఫేజ్ క్లినికల్ ట్రయల్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ క్యాన్సర్ ఎక్కువగా నాడీ కణాల్లో ప్రారంభమౌతుంది. తరచుగా పిండంపై ప్రభావం చూపుతుంది.

డీఎన్‌ఎ లోని పీసీఎన్‌ఎ క్యాన్సర్ కణతులు వృద్ది చెందేందుకు సహకరిస్తుంది. ఈ ఔషధం పీసీఎన్‌ఎను లక్షంగా చేసుకుని పనిచేస్తుందని పేర్కొన్నారు. అంటే జన్యు పదార్థం లోని ఆరోగ్యకరమైన కణాలపై ప్రభావం చూపదు. ఇది కణ తంతువు లోని క్యాన్సర్ కణాలు నశించేలా పనిచేయడంతో రొమ్ము మెదడు,అండాశంయ, చర్మ , ఊపిరితిత్తులకు సోకే రకరకాల క్యాన్సర్లను నివారించడంలో కూడా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. “ హీలీ క్యాన్సర్‌తో పోరాడి ప్రాణాలు కోల్పోయింది. ఆమె చివరి క్షణాల్లోనేను తన తండ్రిని కలిశాను. అప్పుడు ఆయన క్యాన్సర్ నివారణకు మందును కనిపెట్టడానికి కొంత డబ్బును పరిశోధనల కోసం ఇచ్చారు. ఆ చిన్నారి కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకున్నాము. అందుకే ఆ ఔషధానికి ఆమె పేరును పెట్టాం ” అని ప్రొఫెసర్ లిండా మల్కాస్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News