Friday, May 3, 2024

సంక్రాంతి తరువాత రెండో దఫా కొత్త రేషన్ కార్డులు

- Advertisement -
- Advertisement -

New ration cards for the second time after sankranti

గతంలో తిరస్కరణకు గురైన దరఖాస్తులు పరిశీలిస్తున్న అధికారుల
1.18లక్షల దరఖాస్తుల్లో 80శాతం పూర్తి చేసినట్లు వెల్లడి
పారదర్శకంగా ఎంపిక చేస్తున్నట్లు పేర్కొంటున్న పౌరసరపరాల శాఖ
అక్రమ కార్డులను గుర్తించి తొలగించేందుకు కసరత్తు

హైదరాబాద్: గ్రేటర్ నగరంలో రెండో దశ కొత్త రేషన్‌కార్డులు పేదలకు అందజేసేందుకు పౌరసరఫరాల శాఖ ప్రయత్నాలు వేగం చేసింది. సంక్రాంతి పండగ తరువాత అర్హులకు పత్రాలు పంపిణీ చేయడంతో పాటు రేషన్ సరుకులు ఇస్తామని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. రెండు నెల కితం మొదటి విడుతలో నగరంలో 50వేలు మందికి కార్డులు ఇవ్వగా, చాలామంది నిరాశ చెందారు. ఈసారైన రేషన్‌కార్డు వస్తుందని ఆశపడితే రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్దానిక ప్రజాప్రతినిధులను కలిసి తాము నిరుపేదలమైన ఆహారభద్రత కార్డురాలేని చెప్పడంతో వారు ప్రభుత్వంతో చర్చించి మరోసారి దరఖాస్తులు పరిశీలన చేసి అర్హులందరికి ఇవ్వాలని కోరడంతో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు పౌరసరఫరాల అధికారుల గత నెల రోజుల ఆదిశగా దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు 80 శాతం దరఖాస్తులు పరిశీలించినట్లు పదిరోజుల్లో పూర్తి అవుతాయని, ఆ తరువాత అర్హుల జాబితా విడుదల చేస్తామని వెల్లడిస్తున్నారు.

గతంలో ఆన్‌లైన్ ద్వారా 2,35,675 దరఖాస్తులు రాగా, వాటిలో 1,18లక్షలు వివిధ కారణాలతో దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. 60వేల దరఖాస్తులను అనర్హతగా గుర్తించారు. తిరస్కరించి వాటిలో ఎక్కువగా చిరు ఉద్యోగులు, రోజు కూలీలు, ప్రైవేటు ఉద్యోగులు, బలహీన వర్గాల కోటాలో ఇళ్లు పొందిన వారి దరఖాస్తులే ఎక్కువగా పెండింగ్‌లో పెట్టినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. నాలుగేళ్ల కితం నుంచి సమర్పించిన దరఖాస్తులను పరిశీలిన చేస్తున్నామని, అప్పటి నుంచి ఎదురుచూస్తున్న వారికి ఈ విచారణలో ఎంపిక చేస్తామని, అవసరమైతే దరఖాస్తుదారుల ఇంటి వద్దకు పూర్తి ఆస్తుల వివరాలు పరిశీలించి అర్హులందరిని గుర్తిస్తామంటున్నారు.

జిల్లా వారి దరఖాస్తుల వివరాలు హైదరాబాద్ జిల్లాలో 99,668 దరఖాస్తులు రాగా, 43, 604 తిరస్కరణ, రంగారెడ్డి జిల్లాలో 74,254 దరఖాస్తులు 38,766 తిరస్కరణ, మేడ్చల్ జిల్లాలో 61,773 దరఖాస్తులు రాగా 36,400లను పెండింగ్‌లో పెట్టారు. వీటిలో ప్రభుత్వ నిబంధనలు ప్రకారం దాదాపు 60 శాతం దరఖాస్తులు ఎంపికయ్యే అవకాశముందని పౌరసరఫరాల అధికారులు భావిస్తున్నారు. అదే విధంగా గతంలో బహుళ అంతస్తుల భవనాలున్న అక్రమంగా కార్డులు పొందిన వారి జాబితా కూడా సిద్దం చేస్తున్నట్లు, ఫిబ్రవరిలో వారి పేర్లును తొలగిస్తామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News