Sunday, April 28, 2024

జనవరిలో కొత్త రేషన్‌ కార్డులు

- Advertisement -
- Advertisement -

అదే నెలలో గల్ఫ్ పాలసీ ప్రకటన

చొప్పదండి, సిరిసిల్ల రోడ్ షోలో కెటిఆర్

మన తెలంగాణ/ చొప్పదండి/నర్సాపూర్ : ఎన్నికలు పూర్తి అయిన తరువాత జనవరిలో కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. మూడు గంటల కరెంటు ఇస్తామన్న కాంగ్రెస్ కావాలా, 24 గంటలు కరెంట్ ఇచ్చే బిఆర్‌ఎస్ కావాలో ఒక్కసారి ఆలోచించి మీరే నిర్ణయించుకొని ఓటు వేయండి అని కెటిఆర్ అన్నారు. చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో బిఆర్‌ఎస్ చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి సుంకే రవిశంకర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నిర్వహించిన రోడ్ షో కార్యక్రమానికి కెటిఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 55 సంవత్సరాలు పరిపాలించిన దౌల్ బా జీ కాంగ్రెస్ పార్టీ సాగునీరు, తాగునీరు, కరెంటు ఇయ్యలేనోడు, అవ్వకు బువ్వ పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు ఇస్తానన్నాడని విమర్శించారు. రైతులకు రూ. 73 వేల కోట్లలను రైతుబంధు కింద 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేస్తూ ఇస్తున్నామన్నారు. ప్రధాని అయిన నరేంద్ర మోడీ 400 గ్యాస్ ధరను రూ. 1200 రూపాయలు చేశాడని దీంతో పేద ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మన బిఆర్‌ఎస్ అధికారం చేపట్టిన వెంటనే రూ. 400 రూపాయలకే గ్యాస్ అందిస్తామమని కెటిఆర్ పేర్కొన్నారు.

నియోజకవర్గంలో స్థానిక బిడ్డ అయిన సుంకే రవిశంకర్ ఐదు సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి అభివృ ద్ధి చేశారని గుర్తు చేశారు. మరోసారి అవకాశం కల్పిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తాం అన్నారు. చొప్పదండి నియోజకవర్గ ప్రజలు సౌమ్యలు శాంతి కామికులు ఆలోచన చేసి నవంబర్ 30న కారు గుర్తుకు ఓటు వేసి స్థానిక బిడ్డ అయిన రవిశంకర్‌ను అసెంబ్లీకి పంపించాలని కోరా రు. అంతకు ముందు చొప్పదండి బిఆర్‌ఎస్ అభ్యర్థి సుంకే రవిశంకర్ కెటిఆర్‌కు ఘన స్వాగతం పలికిన ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక బిడ్డ ను ఊపిరి ఉన్నంతకాలం మీకు సేవ చేస్తానని, చొప్పదండి నియోజకవర్గంలో 600 కోట్లతో కొండగట్టు అభివృద్ధితో పాటు, వంద పడకల ఆస్పత్రి, 33 కోట్లతో సెంట్రల్ లైటింగ్ పనులను చేపట్టినట్లుగా తెలిపారు. చొ ప్పదండిలో మినీ స్టేడియం, మినీ ట్యాంక్ బండ్, సిరిసిల్లలా చొప్పదండి మున్సిపాలిటీని గల్లి గల్లి అభివృద్ధి చేయాలని కోరారు. గెలిచిన వెంటనే రవిశంకర్ అడిగిన పనులను చేపడుతామని కెటిఆర్ హామీ ఇచ్చారు.

ధర్మయుద్ధంలో గెలిచేది బిఆర్‌ఎస్ పార్టీనే
బిజెపి, కాంగ్రెస్‌లతో జరిగిన ఎన్నికల ధర్మ యుద్ధంలో మూడవసారి గెలిచేది బిఆర్‌ఎస్ పార్టీయేనని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో బిఆర్‌ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ ఎద్దు, ఎవసం తెలియని కాంగ్రెస్ నాయకులు రైతుబంధు దుబారా అంటున్నారని, తెలంగాణలోని 70 లక్షల రైతులకు, 73 వేల కోట్ల రైతుబంధు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగా ణ రాష్ట్రమని కెటిఆర్ అన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి 11 సార్లు అవకాశం ఇస్తే చేసిన అభివృద్ధిని ఏమీ లేదని, ఒక్కసారి అవకాశం అంటూ ప్రజలను మోసం చే సేందుకు కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారంలో చెప్పడం సిగ్గుచేటుగా ఉందన్నారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే కరెంటు కష్టాలు తప్పవని వెనకటి కరెంటు కష్టాల ను గుర్తుంచుకొని, రైతులకు చేయూతను అం దిస్తున్న బి ఆర్‌ఎస్‌కు ఓటు వేసి గెలిపించాలని కెటిఆర్ కోరారు.

నర్సాపూర్ కాంగ్రెస్ టికెట్‌ను పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమ్ముకున్నాడని, కొడంగల్, కామారెడ్డిలలో రేవంత్ రెడ్డి ఓటమి ఖాయమ ని అన్నారు. రాష్ట్రంలో ఉన్న పేదల సంక్షేమం కోసం రైతుబంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా ఇలా ఎన్ని సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగిందన్నారు. బిజెపి నాయకులు రకరకాల డ్రామాలు వేస్తున్నారని తెలిపారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 400లకే వంట గ్యాస్ ఇస్తామని మంత్రి అన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన కెసిఆర్‌ను గిరిజనులు మరిచిపోరని అన్నారు. డిసెంబర్ 30న ప్రజలంతా కారు గుర్తుకు ఓటు వేయాలని, నర్సాపూర్ నియోజకవర్గంలో నుండి సునీత రెడ్డి గెలిపిస్తే, సునీత రెడ్డి మదన్ రెడ్డి కలిసి నర్సాపూర్‌ను మరింత అభివృద్ధి పథంలో సాగుతుందని కెటిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News