Thursday, May 2, 2024

ఇపిఎఫ్ కొత్త నిబంధనలు అమలు

- Advertisement -
- Advertisement -
EPF
మే నుంచి మూడు నెలలపాటు ఇపిఎఫ్ సహకారం 10%కి తగ్గింపు

న్యూఢిల్లీ: ఇపిఎఫ్(ఉద్యోగ భవిష్య నిధి) కొత్త నిబంధనలు మే నెల నుంచి మూడు నెలలపాటు అమలు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. మే, జూన్, జులై నెలల్లో ఇపిఎఫ్ సహకారం 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గనుంది. ఈమేరకు కేంద్ర కార్మిక, ఉద్యోగ మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో ద్రవ్యలభ్యత సమస్యలను ఎదుర్కొంటున్న 4.3 కోట్ల సంఘటిత రంగ ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు.

6.5 లక్షల మంది ఉద్యోగుల అప్పు తగ్గనుంది. ఈ కొత్త నిర్ణయం అమలుతో వచ్చే మూడు నెలల్లో రూ.6,750 కోట్ల ద్రవ్యలభ్యత చేకూరనుంది. ఇపిఎఫ్ సహకారం తగ్గింపుతో ఉద్యోగుల కంట్రిబ్యూషన్ కూడా తగ్గుతుంది. కోవిడ్19 మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో యజమాలు, ఉద్యోగుల చేతుల్లో ద్రవ్య లభ్యత కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడు నెలల పాటు ఉద్యోగులు, యజమానుల పిఎఫ్ సహకారం తగ్గించనున్నట్టు గత వారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

New rules for Employees provident fund

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News