Monday, April 29, 2024

చిక్కని.. చిరుత

- Advertisement -
- Advertisement -
leopard
జీవికేలో చిరుత సంచారం ఉత్తిదే..!

రాజేంద్రనగర్: అదిగో చిరుత అంటే, ఇదిగో పులి అన్న పుకార్లు గ్రేటర్ మహానగరంలోని శివారు ప్రాంతాలతో పాటు రంగారెడ్డి జిల్లా పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. శివారులోని గగన్‌పహాడ్ వద్ద కలకలం సృష్టించిన చిరుతపులి తప్పించుకుపోవడంతో ఆయా ప్రాంతాలో చీకటి పడితే చాలా ప్రజలు తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆదివారం అజీజ్‌నగర్‌లో కలకలం రేపిన చిరుత పుకార్ల సంఘటన నేపథ్యం మంగళవారం ఆ గ్రామ సమీపంలోని జీవీకే ఫామ్‌హౌస్‌లోని స్విమ్మిగ్ పూల్లో ఆ చిరుత నీరు తాగుతుండగా వాచ్‌మెచ్ చూశాడంటూ విస్తృతంగా ప్రచారాలు జరిగాయి.

దాంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు చిరుతను గుర్తించే పనితో పాటు ఒక వేళ అది నిజమే అయి ఉంటే బంధించాలనే కార్యాచరణతో బోన్లను సిద్ధం చేసుకున్నారు. కానీ అటవీశాఖ, పోలీసుల అధికారులకు గగన్‌పహాడ్ చిరుత ఎక్కడికి వెళ్లి ఉంటుందో కచ్చితంగా తెలియక పోవడంతో ప్రజల్లో నెలకొన్న ఆందోళనలకు కంటిమీద కూనుకులేకుండా చేస్తున్నాయి. జీవీకేలో చిరుత సంచారంపై రంగారెడ్డి జిల్లా అటవీశాఖ అధికారి భీమానాయక్‌ను మన తెలంగాణ వివరణ కోరగా అదేమి లేదని ఆయన తెలిపారు.

జీవీకేలో చిరుత సంచరించిన ఆనవాళ్లు ఏమి లేవని, గగన్‌పహాడ్‌లో సంచరించిన చిరుత మాత్రం తన ప్రాధేశిక నివాస ప్రాంతానికి వెళ్లిందని స్పష్టం చేశారు. అయితే ఆ చిరుత ప్రాధేశిక నివాస ప్రాంతం ఒక్కడ ఉందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో అదిగో తోక అంటే ఇదిగో పులి అన్న విధంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని మొయినాబాద్, పెద్దమంగళారం, శంషాబాద్, కొత్వాల్‌గూడ, హిమాయత్‌సాగర్, చిలుకూరు, అజీజ్‌నగర్, గగన్‌పహాడ్, రాజేంద్రనగర్, బుద్వేల్, ఇందిరాగాంధీ హౌజింగ్ సొసైటీ, శ్రీరామకాలనీ, గ్రీన్ సిటీ, జల్‌పల్లి పరిధిలోని దరిగుట్ట రిజర్వు ఫారెస్ట్, పహాడీ షరీఫ్, మామిడిపల్లి తదితర ప్రాంతాల బస్తీలు, గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు. అయితే చిరుత మొయినాబాద్ పరిసరాల్లో సంచరిస్తున్నట్లు తెలియవచ్చింది.

operation still underway to catch leopard in hyd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News