Tuesday, April 30, 2024

అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు

- Advertisement -
- Advertisement -

దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవులకు పూర్తిగా విస్తరణ
రానున్న 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం
విదర్భ నుంచి కోస్తాంధ్ర జిల్లాలో కొనసాగుతున్న ఉష్ణగాలుల తీవ్రత

Niruthi ruthupavanalu in telugu

మనతెలంగాణ/హైదరాబాద్:  నైరుతి రుతుపవనాలు అండమాన్‌ను తాకాయని, బంగాళాఖాతంలో మరింత చురుగ్గా కదురుతున్నాయని ఐఎండి తెలిపింది. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవులకు పూర్తిగా విస్తరించాయని అధికారులు తెలిపారు. సాధారణ షెడ్యూల్ కంటే ఆరు రోజుల ముందుగానే రుతుపవనాలు విస్తరించాయని, ఈ నేపథ్యంలోనే వ్యవసాయ ఆధారిత దేశానికి ఎంతో కీలకమైన నాలుగు నెలల వర్షాకాల సీజన్ ప్రారంభం అయినట్టేనని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణకోస్తా, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. వచ్చే 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. విదర్భ నుంచి కోస్తాంధ్ర జిల్లాలో కొనసాగుతున్న ఉష్ణగాలుల తీవ్రత కొనసాగుతున్నట్టు అధికారులు వివరించారు.
జగిత్యాల, కోరుట్ల, రాయికల్, మేడిపల్లిలో ఈదురు గాలులు..
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. జగిత్యాల, కోరుట్ల, రాయికల్, మేడిపల్లిలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుంది. దీంతో జగిత్యాల- టు నిజామాబాద్ జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక సిరిసిల్ల, వేములవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, మెదక్ జిల్లాల్లో కూడా భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ద్రోణి ప్రభావంతో తేలికపాటి వర్షాలు మరో రెండు రోజులపాటు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. మరో రెండు రోజులు ద్రోణి ప్రభావం కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. అలాగే ఎండల తీవ్రత తగ్గిపోయి సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, మధ్యాహ్నం నుంచి ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి ఈదురు గాలులతో తేలికపాటి వర్షాలు, తేలికపాటి జల్లులు కురిశాయి.
రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా….
కామారెడ్డి జిల్లా (బీబీపేట)లో 88 మిల్లీమీటర్లు, మెదక్‌లో 71.3 మి.మీ, నిజామాబాద్‌లో 69.3, కుమురంభీం ఆసిఫాబాద్ 51.2, రాజన్న సిరిసిల్ల 50.8, జగిత్యాలలో 46.5, మేడ్చల్ మల్కాజిగిరిలో 41.5, నిర్మల్‌లో 40.3, సిద్ధిపేటలో 35.3, సంగారెడ్డిలో 23.8, మహబూబ్‌నగర్‌లో 22, నాగర్‌కర్నూల్‌లో 21.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.
రానున్న 2-3 రోజుల్లో బంగాళాఖాతం దక్షిణ ప్రాంతాలకు…
నైరుతి రుతుపవనాల రాకతో అండమాన్ నికోబర్ దీవులు సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రానున్న 2-3 రోజుల్లో బంగాళాఖాతం దక్షిణ ప్రాంతాలకు, అండమాన్ సముద్రం, అండమాన్ దీవులు మొత్తానికి, బంగాళాఖాతం తూర్పు మధ్య ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండి తెలిపింది. లక్షద్వీప్, ఉత్తర తమిళనాడు తీరం వెంట సైక్లోనిక్ సర్కులేషన్ కారణంగా కేరళ సహా కర్ణాటక తీర ప్రాంతాలు, దక్షిణ ప్రాంతాల్లో రానున్న ఐదు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది ఐఎండీ తెలిపింది. సాధారణంగా ఏటా జూన్ 1వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు కేరళకు చేరతాయి. అయితే ‘అసని తుఫాను’ కారణంగా ఐదు రోజులు ముందే మే 27వ తేదీన రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని ఇటీవలే ఐఎండి ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే నైరుతి రుతుపవనాల ముందస్తు రాకతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News