Saturday, May 4, 2024

ప్రసూతి సెలవు 9 నెలలైతే మేలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రసూతి సెలవులను 9 నెలల పాటు కల్పించాల్సి ఉందని, ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు స్పందించాల్సి ఉందని నీతి ఆయోగ్ సభ్యులు వికె పాల్ సూచించారు. గర్భిణులు అయిన ఉద్యోగులకు ఇప్పటివరకూ ఆరు నెలల ప్రసూతి సెలవు ఉంది.

అయితే తల్లి శిశువు పరిపూర్ణ ఆరోగ్యం కోణంలో పరిశీలిస్తే ఇది తొమ్మిది నెలల వరకూ కల్పించాల్సి ఉందని పాల్ తెలిపారు. 2017లో ఆమోదించిన మెటర్నిటీ బెనిఫిట్ బిల్లు మేరకు ఉద్యోగినులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవును 26 వారాలుగా ఖరారుచేశారు. అంతకు ముందు ఇది 12 వారాలుగా ఉండేది. దీనిని 40 వారాలకు పెంచాల్సి ఉందని పలు మహిళా సంస్థల నుంచి డిమాండ్ వస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News