Wednesday, May 1, 2024

ఆల్కాహాల్ త్రాగేవారు ‘మహాపాపులు’, ‘భారతీయులు కాదు’: నితీశ్ కుమార్

- Advertisement -
- Advertisement -

 

Nitish Kumar
న్యూఢిల్లీ: బీహార్ ప్రాహిబిషన్ అండ్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు 2022ను శాసనసభ ఆమోదించాక బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆల్కాహాల్(మత్తుపానీయాలు) త్రాగే వారు ‘మహాపాపులు’ అన్నారు. ‘ఒకవేళ జాతిపిత(మహాత్మా గాంధీ) ఆదర్శాలకు కట్టుబడి ఉండకపోతే నేను వారిని భారతీయులుగా భావించను’ అని ఆయన అసెంబ్లీలో అన్నారు. ‘ఎవరైతే బాపు చెప్పినవి వినని వాళ్లను నేను ‘మహాపాపి, మహా అయోగ్యులు’గా భావిస్తాను’ అన్నారు.
బీహార్‌లో ప్రభుత్వం నిర్వహించిన 2018 సర్వే ప్రకారం 1కోటి 74లక్షల మంది ఆల్కాహాల్ త్రాగడం మానివేశారని నితీశ్ కుమార్ తెలిపారు. ఆదాయం లభిస్తున్నందున రాష్ట్రాలు ఆల్కాహాల్‌ను నిషేధించడం లేదు’ అని చెప్పుకొచ్చారు. ‘ఒకవేళ ఆల్కాహాల్ త్రాగడంపై ఖర్చు చేసే వ్యక్తి త్రాగడం ఆపేస్తే, అతడు ఆ డబ్బును తన కుటుంబం తినేందుకు ఖర్చు చేయగలడు’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News