Friday, May 3, 2024

చెరువును కబ్జా చేసిన వ్యక్తులు ఎంతటి వారైనా ఉపేక్షించం

- Advertisement -
- Advertisement -

తుర్కయంజాల్: మా సబ్ చెరువును కబ్జా చేసి, మట్టిని డంపు చేసిన వ్యక్తులను ఎంతటి వారినైనా ఉపేక్షించేదిలేదని రంగారెడ్డి జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం సాగర్ రహదారి తుర్కయంజాల్ మాసబ్ చెరువులో ఎఫ్‌టిఎల్ పరిధిలో మట్టిని డంపు చేసిన స్థలాలు సర్వేనెంబర్ 205, 137లను ఎమ్మెల్యే, వి విధ శాఖల అధికారులతో కలిసి పరిశీలిం చి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పెద్ద చెరువులలో మాసబ్‌చెరువు ఒకటని, కాపాడేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని ఆక్షేపించారు. చెరువులో పెద్దఎత్తున మట్టిని డంపు చేస్తుంటే ఇరిగేషన్ అధికారులు ఎందుకు చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశా రు. సాగర్ రహదారి పక్కనే ఉండడం వల్ల భూముల విలువలు అధికంగా ఉండడం తో కబ్జాదారులకు కన్నుపడిందని అక్రమం గా మట్టి పోసి కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితి లో అధికారులు కబ్జాదారుల నుండి చేరువును కాపాడి పోసిన మట్టిని తొలగించడానికి కృషి చేయాలని వివరించారు.

తీసే మట్టికి అయ్యే ఖర్చు మొత్తం వారే భరించేల చర్యలు చేపట్టాలని అన్నారు. సర్వేనెంబర్ 205లో ఉన్న 10 ఎకరాల భూమిలో ఈ రోజు నుంచి ఆగష్టు 8వ తేదీ వరకు ఏ లాంటి నిర్మాణాలు, మట్టి డంపు చేయడం వంటి పనులు జరగనివ్వకుండా పోలీసు లు చర్యలు చేపట్టాలని సూచించారు. అ సలు దోషులను వదిలిపెట్టి అమాయక రైతులపై కేసులు నమోదు చేయడంపై అసహనం వ్యక్తం చేశారు.
దీనికి కారుకులైన వారిని గుర్తించి కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. ఇప్పటికైనా ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు వెంటనే స్పం దించి కబ్జా దారులపై చర్యలు చేపట్టి చేరువును కాపాడాలని పెర్కోన్నారు. అదేవిధం గా నేడు మంగళవారం హెచ్‌ఎండిఏ అధికారులు చెరువు పరిశీలనకు వస్తున్నట్లు తె లిపారు. ఇరిగేషన్ అధికారులు,హెచ్‌ఎండి ఏ అధికారులు ఇరువురు సమన్వయంతో ముందుకు వెళ్లి పరిష్కరించే దిశగా కృషి చే యాలని సూచించారు.

కార్యక్రమంలో జి ల్లా డిసిసిబీ వైస్ ఛైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు వంగేటి లకా్ష్మరెడ్డి, పురపాలిక కమిషనర్ సాబేర్ అలీ, ఇరిగేషన్ అధికారి గంగా, ఉషారాణి, నిదేష్, అర్‌ఐ బిక్షపతి, బ్యాంకు డైరక్టర్ సామ సంజీవరెడ్డి, సీనియర్ నాయకులు కందాడ లకా్ష్మరెడ్డి, ముత్యంరెడ్డి, చెరువు పరిరక్షణ సభ్యులు రొక్కం చంద్రశేఖర్‌రెడ్డి, బచ్చిగల్ల రమేశ్, న్యాయవాది అ రుణ్‌కుమార్, కొంతం యాదిరెడ్డి, పురపాలిక బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు వేముల అ మరేందర్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు ఆశ్విని, కళ్యాణ్‌నాయక్, పులగుర్రం విజయానంద్‌రెడ్డి, తాళ్లపల్లి మోహన్‌గుప్త, నా రని శేఖర్‌గౌడ్, గుండ ధన్‌రాజ్. కోండ్రు శ్రీనివాస్, ఆర్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News