Friday, May 3, 2024

గోషామహల్‌లో బిఆర్‌ఎస్ గెలుపు ఖాయం

- Advertisement -
- Advertisement -

గోషామహల్: సిఎం కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసు కువెళ్లి, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీఆర్‌ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని గోషామ హల్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జి నందకిశోర్‌వ్యాస్, గోషామహల్ నియోజకవర్గం బిఆర్‌ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు శీలం సరస్వతి ముదిరాజ్‌లు పిలుపునిచ్చారు. ఈ మేరకు గోషామహల్ బిఆర్‌ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు శీలం సరస్వతి ముదిరాజ్ నేతృత్వంలో మహిళా నాయకురాళ్లు గోషామహల్ బీఆర్‌ఎస్ ఇంచార్జి నందకిశోర్‌వ్యాస్‌ను బేగంబజార్‌లోని పార్టీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి. పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా శీలం సరస్వతి మహిళా నేతలతో కలిసి నందకిశోర్‌వ్యాస్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు గోషామహల్ నియోజకవర్గం లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, తెలంగాణ ప్రభుత్వం నియోజకవర్గం లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న కుటుంబాలు, వారిని పార్టీవైపు తిప్పుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించారు. త్వరలో నియోజకవర్గంలోని బిఆర్‌ఎస్ ముఖ్యులందరితో చర్చించి, పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన కార్యాచర ణతో పాటు బిఆర్‌ఎస్ పార్టీ గెలుపు కోసం అనుసంచాల్సిన వ్యూహాలను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.

డివిజన్లవారీగా అనుబంధ విభాగాల ఆధ్వ ర్యంలో సమావేశాలు ఏర్పాటు చేసి, పార్టీ శ్రేణులను ఇ ప్పటి నుంచే ఎన్నికలకు సన్నద్దం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గోషామహల్ బిఆర్‌ఎస్ మహిళా కార్యదర్శి సంతోషితో పాటు నాగమణి, ఉమారాణి, అనురాధ, రేణుక, కళ్యాణి, సంగీత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News