Friday, April 26, 2024

సుప్రీంకోర్టులో ముందస్తు పిటిషన్లు దాఖలు చేయలేదు : కవిత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తాను సుప్రీంకోర్టులో శుక్రవారం ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ప్రకటించారు. తన పిటిషన్ ను ముందస్తుగా విచారించాలని కోరుతూ సుప్రీంకోర్టులో తాను ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదని కవిత తేల్చి చెప్పారు. గతంలో తాను దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 24న సుప్రీంకోర్టులో విచారణ జరగనుందని ఆమె వివరించారు. ఈ నెల 15వ తేదీన ఇడి విచారణపై బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ఇడి విచారణపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 24న విచారణ చేస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. మరో వైపు ఈ నెల 20వ తేదీన విచారణకు హాజరు కావాలని కవితకు ఇడి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న ఇడి విచారణకు కవిత హాజరు కాలేదు. సుప్రీంకోర్టు విచారణ తర్వాతే విచారణకు హాజరు కానున్నట్టుగా కవిత ఇడికి లేఖ పంపారు. కానీ ఈ నెల 20వ తేదీనే విచారణకు రావాలని కవిత ఇడి అధికారులు గురువారం సమన్లు పంపారు. దరిమిలా తన పిటిషన్ ను ముందస్తుకు విచారించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని మీడియాలో కథనాలు వచ్చా యి. అయితే తాను ఈ విషయమై సుప్రీంకోర్టులో తన పిటిషన్ ను మందస్తుగా విచారించాలని పిటిషన్ దాఖలు చేయలేదని ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News