Sunday, April 28, 2024

నేమ్ పేట్లు తీసేస్తున్నారు….

- Advertisement -
- Advertisement -

ఘర్షణల నేపథ్యంలో తమ మతమేదో తెలియకుండా జాగ్రత్త పడుతున్న ఈశాన్య ఢిల్లీవాసులు n బతుకు జీవుడా అంటూ సహాయ కేంద్రాలకు తరలుతున్న పలువురు
దుకాణాల పేర్లు మార్చుకుంటున్న వైనం

Delhi Violence

 

న్యూఢిల్లీ : మనిషికి ఊరూ పేరూ ఆయువుపట్టే. అయితే తమ పేర్లే తమకు ఎసరు పెడుతున్నాయనే భయంతో ఈశాన్య ఢిల్లీ వాసులు ఇంటిముందు నేమ్‌ప్లేట్ల బోర్డులను తీసివేశారు. పౌరచట్టం చిచ్చు రగిలిన ఈశాన్య ఢిల్లీలో గతవారం రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే పలు బస్తీలలోని కుటుంబాలు ఎప్పుడేమి జరుగుతుందో తెలియని స్థితిలో ఇండ్లకు తాళాలు వేసి వెళ్లారు. వెళ్లుతూ వెళ్లుతూ తమ ఇంటి ముందటి పేర్లు తెలిపే బోర్డులను తీసివేశారు. నేమ్‌ప్లేట్‌తో పేరు తెలుస్తుంది. పేరుతో కులం కాకపోయినా మతం వెల్లడవుతుంది. అందుకే తాళాలు వేసిన ఇండ్లు ఎవరివో తెలియకుండా ఉండేందుకు నేమ్‌ప్లేట్లు తీసిపడేసి దూర ప్రాంతాలకు తరలివెళ్లారు. శివ్ విహార్ ప్రాంతం…లోపలికి వెళ్లితే ఇరుకైన గల్లీల్లో అంతా ఖాళీ పరిస్థితి ఉంది. జన సంచారం లేదు. ఇదే విధంగా ముస్తఫాబాద్‌ను ఆనకుని ఉండే ప్రాంతాలలోని హిందువుల కుటుంబాల చాలా వరకూ ఇళ్లకు తాళాలు వేసుకుని బతుకుజీవుడా అంటూ వెళ్లారు. తమ గుర్తింపును తెలిపే నేమ్‌ప్లేట్లను , ఇతర చిహ్నాలను బయట కన్పించకుండా చేసుకున్నారు. కొందరు తమ నేమ్‌ప్లేట్లను వెంట తీసుకువెళ్లారు. కొందరు దగ్గరిలోని చెత్తకుండీల వద్ద పారేసి వెళ్లారు. గత నెల 24వ తేదీన ఢిల్లీలో ఘర్సణలు చెలరేగగానే 32 ఏండ్ల దీపక్ రజోరా గజియాబాద్‌లోని తన బంధువుల ఇంటికి పారిపొయ్యాడు. వెళ్లేటప్పుడు తాను తండ్రి పేరుబోర్డును తీసివేసి వచ్చినట్లు తెలిపారు. చాలా మంది ఇదే విధంగా చేస్తున్నట్లు , పేరు కన్నా ప్రాణం ముఖ్యమని బోర్డులు తీసివేసినట్లు తన బాధ ఏకరువు పెట్టారు. తమ గల్లీలో మూలకు ఉండే ఇళ్లు చాలా వరకూ బుగ్గి అయినట్లు తెలిపారు.
దుకాణాల పేర్లకు మార్పులు
ఈశాన్య ఢిల్లీకి అతి సమీపంలోని బురారిలో పలు దుకాణాల పేర్లు మార్చివేశారు. ఈ ప్రాంతంలోని ముస్లిం వారి దుకాణాలకు ఇంతకాలం వారి పేర్లు ఉండేవి. శివ్‌విహార్ ప్రాంతంలోని మాలిక్ క్లోత్ పేరిట ఉన్న దుకాణం యజమాని యాకుబ్ మాలిక్ హోర్డింగ్ తీసిపడేశారు. ఇక్బాల్ ఫర్నిచర్ షాపు వారిది ఇదే పరిస్థితి. వారు కూడా పేరు బోర్డు తీసివేశారు. పేర్లను బట్టి తాము ఎవరో తెలుస్తుంది. దీనితో తాము అల్లరిమూకలకు నిషానా అయిపోతామని, అందుకే ఎందుకొచ్చిన జంజాటం అని బోర్డులు తీసిపడేస్తున్నట్లు ఇక్బాల్ , ఈ ప్రాంతంలోని ఇతర దుకాణాదార్లు తెలిపారు. ఇక తన పొరుగింటి వాడైన శివభాయ్‌కు మెడికల్ షాప్ ఉందని, ఇంతవరకూ ప్రముఖంగా ఉండే ఓం గుర్తును ఆయన చెరిపివేశాడని, ఇప్పటికైతే తనకు, శివభావయ్‌కు ఎటువంటి నష్టం జరగలేదని ఇక్బాల్ చెప్పారు. చాలా రోజుల తరువాత శాంతినెలకొనడంతో ఇప్పుడిప్పుడే హిందూ ప్రాంతాలలోని ముస్లిం సోదరులు తమ షాపులు తెరుస్తున్నారు. అదే విధంగా ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలోని హిందువులు తమ దుకాణాలు, వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలను తిరిగి తెరిచారు. భజన్‌పురాలో షా ఎ అలామ్ ఓ షాపు నడిపిస్తున్నాడు. ఘర్షణలప్పుడు తన దగ్గర పనిచేసే యూనస్ తెలివిగా వ్యవహరించినట్లు , షాపు విద్యుత్ స్విచ్ఛ్ ఆఫ్ చేసినట్లు, ముందుగా ఇర్ఫాన్ షాపు హోర్డింగ్‌ను లోపల పెట్టినట్లు యజమాని ఆలం తెలిపారు.

 

North East Delhi peoples remove Name Plates

 

North East Delhi peoples remove Name Plates
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News