Tuesday, April 30, 2024

భారత్ మాతంటే వొళ్లుమంటా?

- Advertisement -
- Advertisement -

మన్మోహన్‌కు మోడీ చురకలు
బిజెపిపిపి భేటీలో మంతనాలు
ఎంపిలకు ప్రసంగ బుక్‌లెట్లు

 

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారత్ మాతాకీ జై నినాదం పట్ల కూడా గౌరవభావం లేదని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. మంగళవారం ప్రధాని మోడీ బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడారు. దేశంలో శాంతిభద్రతలు సవ్యంగా ఉంటేనే ప్రగతి సాధ్యమని, ఈ దిశలో బిజెపి ఎంపీలు తగు విధంగా వ్యవహరించాల్సి ఉందని తెలిపారు. కొందరికి దేశం పట్ల , భారత మాత పట్ల సదభిప్రాయం లేదనట్లుగా ఉందని పరోక్షంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై దాడికి దిగారు. భారత్ మాతాకీ జై నినాదంలో కూడా వారు తప్పుడు అర్థాలు వెతుకుతున్నారని, దీని పట్ల ఏదో సందేహం వ్యక్తం చేస్తున్నారని ప్రధాని మండిపడ్డారు. ఈ వైఖరి వారితో నిమిత్తం లేకుండా బిజెపి ఎంపిలు సమాజంలో శాంతి సామరస్యాల పరిరక్షణకు కృషి చేయాలని ప్రధాని పిలుపు నిచ్చారు. దేశమంటేనే ప్రగతి, శాంతి భద్రతలుంటునే ప్రగతి సాధ్యం అని, దీనిని అంతా గుర్తించాల్సి ఉందని తెలిపారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇటీవల ఒక చోట మాట్లాడుతూ కొందరు భారత్ మాతాకీ జై నినాదాన్ని రెచ్చగొట్టేందుకు, చిచ్చుపెట్టేందుకు వాడుతున్నారని, దీనితో ఈ నినాదం దెబ్బతిందని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ స్వాతంత్య్రోద్యమ ఘట్టంలోనూ వందేమాతరం గురించి ఇదే విధంగా కొందరు వాదనలకు దిగారని తెలిపారు. వందేమాతం ఆలాపించడం నేరం పాపం అన్నారని, ఇప్పుడు భారత్ మాతాకీ జైపై దుమారం లేపుతున్నారని విమర్శించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు అయినా భారత్ మాతాకీ జై అనడం నేరంగా చిత్రీకరించడం దారుణం అని, ఇది తనకు బాధాకరంగా ఉందన్నారు. ప్రధానిగా వ్యవహరించిన వ్యక్తి ఒకరు భారత్ మాతా నినాదాన్ని తప్పుపట్టడం దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. తనతో పాటు దేశభక్తులు ఎందరో మాజీ ప్రధాని వ్యాఖ్యలతో చింతిస్తున్నారని అన్నారు.

దేశాన్ని అస్థిరపర్చేందుకు పలు శక్తులు ప్రయత్నిస్తున్నాయని, ఈ శక్తులను తిప్పికొట్టేందుకు పార్టీ వర్గాలు అన్నీ కూడా కట్టుదిట్టంగా పనిచేయాల్సి ఉందని పిలుపు నిచ్చారు. కొందరికి రాజకీయ స్వార్థం కీలకం అని, వారికి దేశ ప్రయోజనాలు పట్టవని, అయితే కాషాయ సంస్థలకు జాతీయ భావన, దేశ ప్రయోజనాలే అత్యున్నతం అని తేల్చిచెప్పారు. వికాసమే బిజెపి మం త్రం అని ప్రధాని తెలిపారు. బిజెపి పిపి సమావేశ వివరాలను ఆ తరువాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ విలేకరులకు తెలిపారు. ఢిల్లీ ఘర్షణలపై పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు చర్చకు పట్టుపడుతూ, హోం మంత్రి అమిత్ షా రాజీనామాకు డిమాండ్ చేస్తున్న దశలో బిజెపి ఎంపీల భేటీ జరిగింది. అమిత్ షా, బిజెపి అధ్యక్షులు నడ్డా ఇతరులు దీనికి హాజరయ్యారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం సందర్భంగా ప్రధాని మోడీ చేసిన ప్రసంగం పాఠంతో కూడిన ప్రతులను ఈ సందర్భంగా ఎంపిలకు పంపిణీ చేశారు. పార్లమెంట్‌లో చర్చల దశలో తగు విధంగా ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు ఎంపిలు ఈ ప్రసంగంలోని అంశాలను చదివి ఆకళింపు చేసుకోవాలని నేతలు సూచించారు.

 

Modi Comments on Manmohan singh about Bharath Matha
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News