Friday, April 26, 2024

జపాన్ మీదుగా ఉత్తర కొరియా ప్రయోగం

- Advertisement -
- Advertisement -

North Korea shoots ballistic missile over Japan

కిమ్ ప్రభుత్వానికి దక్షిణకొరియా హెచ్చరికలు జారీ

సియోల్: ఉత్తర కొరియా మంగళవారం జపాన్ మీదుగా సుదీర్ఘ క్షిపణి ప్రయోగం నిర్వహించింది. జపాన్‌లో కలకలం రేగింది. గత ఐదేళ్లలో ఉత్తరకొరియా ఈవిధంగా క్షిపణిని ప్రయోగించడం ఇదే ప్రథమం. ఈనేపథ్యంలోప్రభావిత ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని జపాన్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణి జపాన్‌మీదుగా వెళ్లి పసిఫిక్ ప్రాంతంలోని పడింది. దీంతో కొరియా, అమెరికా బలగాలు జెట్స్‌ను మోహరించాయి. తమ బలాన్ని చూపేందుకు దక్షిణకొరియాకు చెందిన పశ్చిమ తీరంలో ఆయుధ ప్రయోగాలు చేపట్టాయి. ఈ ఏడాది కొరియా దేశీయంగా అభివృద్ధి చేసిన క్షిపణులను అమెరికా దాని మిత్రదేశాలను లక్షంగా చేసుకుని ప్రయోగాలు చేస్తోందని తెలిపారు. జపాన్ మీదుగా మిసైల్‌ను ప్రయోగించడాన్ని అమెరికా ఖండించింది. దక్షిణి కొరియా అధ్యక్షుడు సుక్ మాట్లాడుతూ ఉత్తర కొరియా ప్రయోగించింది మధ్యంతర రేంజ్ క్షిపణిగా పేర్కొన్నారు. ఉత్తర కొరియాలోనని జగాంగ్ ప్రావిన్స్ నుంచి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు.

ఉత్తర కొరియా ప్రయోగాలను పునరావృత్తం చేస్తే సియోల్, వాషింగ్టన్ సామర్థాన్ని ఎదుర్కొవాల్సి ఉంటుందని చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. జపాన్ కోస్ట్‌గార్డ్ కూడా ఉత్తరకొరియా ప్రయోగం చేసిదని ధ్రువీకరించింది. క్షిపణి ప్రయోగాన్ని జపాన్ ప్రధాని కిషిదా ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాల నేపథ్యంలో తమ రక్షణవ్యవస్థను పటిష్టం ఎదురుదాడికి సిద్ధంగా ఉన్నామని యసుకాజు తెలిపారు. కాగా తర్వాత ఉత్తర కొరియా జపాన్‌పై క్షిపణి ప్రయోగం చేయడం ఇదే తొలిసారి. జపాన్, దక్షిణకొరియా దేశాల అంచనా ప్రకారం కొరియా ప్రయోగించిన నుంచి 4,600 కిలోమీటర్లు (28002860 మైళ్లు) ప్రయాణించింది. 970 నుంచి 1000 కిలోమీటర్లు (600620 మైళ్లు) ఎత్తులో ప్రయాణించి పసిఫిక్ సముద్రంలో ల్యాండ్ అయింది. క్షిపణి పడిన ప్రాంతం తీరానికి కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ఓడలు, విమానాలకు ఎటువంటి నష్టం జరగలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News