Tuesday, April 30, 2024

కిమ్ సమరోన్మాదం

- Advertisement -
- Advertisement -

మరిన్ని క్రూజ్ క్షిపణుల పరీక్ష
యుద్ధానికి సన్నద్ధం కావాలి
ఉత్తర కొరియా మిలిటరీకి కామ్ పిలుపు
షిప్‌యార్డ్ సందర్శన

సియోల్ : ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ సమరోన్మాదంతో సాగుతున్నారు. సముద్రంలోకి క్రూజ్ క్షిపణులు ప్రయోగించడం ద్వారా ఉత్తర కొరియా ఆయుధ పరీక్షలతో రెచ్చగొట్టే చర్యలు కొనసాగించింది. కిమ్ జాంగ్ ఉన్ ఒక షిప్‌యార్డ్‌ను సందర్శిస్తూ యుద్ధ సన్నాహకాలు పెంచాలని తన మిలిటరీకి పిలుపు ఇచ్చారు. తమ పశ్చిమ సముద్రంలోకి ఉత్తర కొరియా క్షిపణుల ప్రయోగాలను అమెరికా, దక్షిణ కొరియా సైనిక బలగాలు విశ్లేషిస్తున్నాయని దక్షిణ కొరియా సంయుక్త సైనిక దళాల అధిపతి తెలియజేశారు.

పలు క్షిపణులను దక్షిణ కొరియా మిలిటరీ కనుగొన్నదని చెప్పిన ఆ అధిపతి క్షపణుల నిర్దిష్ట సంఖ్య వెల్లడికి లేదా వాటి పరీక్ష లక్షణాల మదింపునకు నిరాకరించారు. ఆ ప్రయోగాలు 2024లో ఉత్తర కొరియా నాలుగవ విడత క్రూజ్ క్షిపణి పరీక్షలు. కిమ్ పశ్చిమ తీరంలోని నాంఫోలో ఒక షిప్‌యార్డ్‌లో కొన్ని నౌకాదళ ప్రాజెక్టులను తనిఖీ చేస్తూ తన నౌకా దళాలను మరింత పటిష్ఠం చేయడంపై దృష్టి సారించానని పునరుద్ఘాటించినట్లు ప్రభుత్వ మీడియా వెల్లడించిన కొన్ని గంటల తరువాత ఆ ప్రయోగాలు చోటు చేసుకున్నాయి.

అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ వల్ల పెరుగుతున్న విదేశీ ముప్పులను ఎదుర్కొనేందుకు అణ్వస్త్ర సహిత నౌకాదళం నిర్మాణానికి తాను కృషి చేస్తున్నట్లు కిమ్ ఇటీవలి మాసాలలో చెప్పారు. కిమ్ అణ్వస్త్రాల, క్షిపణి కార్యక్రమాన్నిదీటుగా ఎదుర్కొనేందుకు ఆ మూడు దేశాలు తమ సైనిక సహకారాన్ని పెంపొందించాయి. కాగా, కిమ్ ఎప్పుడు నాంఫోను సందర్శించిందీ ఉత్తర కొరియా అధికార కొరియన్ కేంద్ర వార్తా సంస్థ తెలియజేయలేదు. నాంఫోలో ఎటువంట యుద్ధ నౌకల నిర్మాణం జరుగుతోందో కూడా ఆ సంస్థ వివరించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News