Thursday, May 16, 2024

మనసులోని మాటకు ప్రాణప్రతిష్ట

- Advertisement -
- Advertisement -

నార్వే రచయిత జాన్ ఫోసెస్‌కు సాహిత్య నోబెల్
స్టాక్‌హోం : ఈ ఏటి మేటి 2023 నోబెల్ సాహిత్య పురస్కారం నార్వేకు చెందిన ప్రముఖ రచయిత జాన్ ఫోసెన్‌కు దక్కింది. గురువారం స్వీడిష్ రాయల్ అకాడమీ తమ పురస్కారాల ఎంపికలో లిటరేచర్‌లో పురస్కారాన్ని అధికారికంగా ప్రకటించింది. వినూత్న ఇతివృత్తపు నాటకాలు, గద్యరచనలో ఆయన ప్రఖ్యాతి వహించారు. అనిర్వచనీయ అంశాలు ఆయన రచనలో ప్రాణప్రతిష్ట పొందాయని విజేత ప్రకటన దశలో స్వీడిష్ అకాడమీ తెలిపింది. జాన్ ఒలావ్ ఫోసే 1959లో నార్వేలోని హేగ్‌సండ్‌లో జన్మించారు.

ఏడేళ్ల ప్రాయంలోనే పెద్ద ప్రమాదానికి గురయ్యిన ఆయన చావుబతుకుల అంచుల వరకూ వెళ్లాడు. తరువాత కోలుకుని , తన జీవితంలో ఏదో ఒక గుర్తింపు దక్కించుకోవాలని పట్టుదలతో ముందుకు సాగాడు. రైటర్‌గా మారేందుకు ఆయనకు తన చిన్ననాటి చేదు అనుభవమే స్ఫూర్తిదాయకం అయిందని చెపుతుంటారు. సాహిత్యంపై ఆసక్తితో సాహిత్యంలో డిగ్రీ పొందిన ఆయన 1983లో రెడ్, బ్లాక్ పేరిట ఓ నవల రాశారు. ఇదే ఆయన తొలి నవల అయింది. తరువాత అనేక కథలు, నాటకాలు, కవిత్వాలు , చిన్నారుల ఇతివృత్తాలతో పుస్తకాలను రచించారు. మానవ జీవితంలోని ఘట్టాలను, ప్రత్యేకించి సంక్లిష్టమైన అనుభవాలను తన రచనకు ఆలంబనంగా చేసుకున్నట్లు జాన్ తెలిపారు.

జీవితాన్ని మించిన గొప్పపాఠం ఏదీ లేదు. జీవితమే మనిషిని ఏ దిశకు అయినా మలుపు తిప్పుతుందని విశ్వసించే ఈ వ్యక్తి డిసెంబర్‌లో నోబెల్ పురస్కారాన్ని నోబెల్ పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో స్వీకరిస్తారు. అత్యంత ప్రాచీన గద్య ప్రక్రియలో సాహిత్య సృష్టి ఈ రచయిత ప్రత్యేకత. తన నార్వే నేపథ్యం, అక్కడి భాషలను సంతరించుకుని ఆయన రచనలు ప్రపంచ ఖ్యాతిని పొందాయని నోబెల్ సాహిత్య కమిటీ అధ్యక్షులు అండర్స్ ఒల్సన్ కొనియాడారు.

తనను సాహిత్య పురస్కారానికి ఎంపిక చేసినందుకు 64 సంవత్సరాల జాన్ ఫోసెస్ హర్షం వ్యక్తం చేశారు. తనకు ఈ పురస్కారం రావడం ఆశ్చర్యం కల్గించిందన్నారు. అవార్డు దక్కుతుందనే నమ్మకం చాలా కాలం క్రితమే ఏర్పడిందన్నారు. నోబెల్ సాహిత్య పురస్కారాలు దక్కించుకున్న నార్వే వారిలో ఇప్పుడు ఫోసే నాలుగో వ్యక్తిగా నిలిచారు. శబ్దాలకు సంబంధించిన ఆయన రచన 2022 ఇంటర్నేషన్ బుకర్ ప్రైజ్ దక్కించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News