Sunday, May 5, 2024

విదేశాల నుంచి వచ్చేవారికి చార్జీలు నిర్ణయించిన కేంద్రం…

- Advertisement -
- Advertisement -

aeroplane

 

కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు

మే 7నుంచి 64 విమానాల్లో తరలింపు

లండన్ నుంచి ఢిల్లీకి ఒక్కొక్కరికి రూ.50 వేలు

కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితి ఏర్పడింది. భారతీయులు పెద్ద సంఖ్యలో విదేశాల్లో చిక్కుకుపోయారు. అలాంటివారిని భారత్ కు తీసుకువచ్చేందుకు కేంద్రం భారీ కార్యాచరణ రూపొందించింది. విదేశాల్లో ఉంటున్న భారతీయుల కోసం మే 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 64 ప్రత్యేక విమానాలు నడపనుంది.

ఇతర దేశాల్లో ఉన్న వేల మంది భారతీయులను దశల వారీగా తరలిస్తారు. అయితే, భారత్ కు రావాలనుకుంటున్న పౌరుల నుంచి రుసం వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. లండన్ నుంచి ఢిల్లీ వచ్చే విమానంలో ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.50 వేలు, ఢాకా నుంచి ఢిల్లీ వచ్చేందుకు రూ.12 వేలు వసూలు చేయాలని నిర్ణయించారు. తొలి విడతలో భాగంగా అమెరికా, గల్ఫ్ దేశాలు, మలేసియా, యూకే, సింగపూర్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ లకు విమానాలు నడపనున్నారు. మొత్తం 14,800 మందిని భారత్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

రాష్ట్రాలు ప్రవాసులు (ఎన్ఆర్ఐలు) విమానాలు దేశాలు
కేరళ 3150 15 7
తమిళనాడు 2150 11 9
మహారాష్ట్ర 1900 07 6
ఢిల్లీ 3100 11 9
తెలంగాణ 1750 07 6
గుజరాత్ 1100 05 5
పంజాబ్ 200 01 1
జమ్ము కశ్మీర్ 600 03 1
కర్నాటక 650 03 3
ఉత్తర ప్రదేశ్ 200 01 1
మొత్తం 14800 64 12

 

విదేశాల నుంచి ఇండియాకు విమాన ప్రయాణికుల టికెట్ ధరలు:

దేశాలు నగరాలు సమయం

(గంటలు)

టికెట్ ధర (రూపాయలు) కరెన్సీ (విదేశాలు) రూపాయి

మారకం విలువ

లండన్ ముంబయి 9 50000 540 93.24
లండన్ అహ్మదాబాద్ 9 50000 540 93.24
లండన్ బెంగళూరు 9.7 50000 540 93.24
లండన్ ఢిల్లీ 9.25 50000 540 93.24
చికాగో ఢిల్లీ 14.35 100000 1361.4 75
చికాగో హైదరాబాద్ 14.35 100000 1361.4 75
న్యూయార్క్ ముంబయి 14 100000 1361.4 75
న్యూయార్క్ అహ్మదాబాద్ 14 100000 1361.4 75
శాన్ ఫ్రాన్సిస్ కో ఢిల్లీ 15.55 100000 1361.4 75
శాన్ ఫ్రాన్సిస్ కో బెంగళూరు 15.55 100000 1361.4 75
డల్లాస్ ఢిల్లీ 14.15 100000 1361.4 75
డల్లాస్ హైదరాబాద్ 14.15 100000 1361.4 75
ఢాకా ఢిల్లీ 2.15 12000 160 75
ఢాకా శ్రీనగర్ 3.3 15000 200 75
దుబాయ్ అమృత్ సర్ 3.10 13000 605 21.50
దుబాయ్ కొచ్చి 3.45 13000 605 21.50
దుబాయ్ ఢిల్లీ 3.10 13000 605 21.50
అబు ధాబి హైదరాబాద్ 3.40 15000 700 21.50
జెడ్డా ఢిల్లీ 5.15 25000 1350 19
కువైట్ అహ్మదాబాద్ 3.30 14000 58.70 241.20
కువైట్ హైదరాబాద్ 4.25 20000 85 241.20
సింగపూర్ ఢిల్లీ 5.5 20000 380 53
సింగపూర్ అహ్మదాబాద్ 4.9 20000 380 53
సింగపూర్ బెంగళూరు 4.5 18000 340 53
మనీలా ఢిల్లీ 7.5 30000 402 75
కౌలాలంపూర్ ముంబయి 5.1 20000 1150 17.6

aeroplane

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News