Saturday, May 11, 2024

దేశంలో తొలి హైడ్రోజన్ బస్సు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: విరివిగా వాడుతున్న శిలాజ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయఇంధనాన్ని తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఓ వైపు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్న కేంద్రం మరో వైపు హైడ్రోజన్‌తో నడిచే వాహనాలకూ పెదద పీట వేస్తోంది. ఇందులో భాగంగా హైడ్రోజన్‌తో నడిచే తొలి బస్సు కమర్షియల్ ట్రయల్స్‌కు సిద్ధమయింది. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉండే శీతల ప్రాంతమైన లడాఖ్ రోడ్లపై పరుగులు పెట్టేందుకు సిద్ధమయింది. హైడ్రోజన్ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ రంగ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్‌టిపిసి అశోక్ లేలాండ్‌తో కలిసి ఈ బస్సులను రూపొందించింది. ఒక్కో బస్సు ఖరీదు దాదాపు రూ.2.5 కోట్ల దాకా ఉంటుంది. మొత్తం 5 బస్సులను లేహ్ అడ్మినిస్ట్రేషన్‌కు ఎన్‌టిపిసి అప్పగిస్తోంది.

ఇందులో భాగంగా తొలి బస్సు తాజాగా లేహ్‌కు చేరుకుంది కూడా. ఈ బస్సుల కోసం ఎన్‌టిపిసి లేహ్‌లో రీఫిల్లింగ్ స్టేషన్‌తో పాటుగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి 1.7 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేసింది. త్వరలో కమర్షియల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. మూడు నెలలపాటు ఈ ట్రయల్స్‌ను నిర్వహిస్తారు. సాధారణ బస్సుల్లో మాదిరిగానే ఈ బస్సుల్లో కూడా టికెట్ ధరలు వసూలు చేయనున్నారు. ఒక వేళ హైడ్రోజన్ బస్సులు నడిపే సమయంలో ఏదైనా నష్ట వాటిల్లితే ఎన్‌టిపిసినే భరిస్తుంది. వాస్తవానికి ఆగస్టు 15నే ఈ సేవలు ప్రారంభం కావలసి ఉన్నప్పటికీ బారీ వర్షాలు, కొండచరియలు విరిగి పడ్డం వంటి కారణాల వల్ల వాయిదా పడింది.ఈ తరహా టెక్నాలజీతో వస్తున్న తొలి బస్సు కావడమే కాకుండా సముద్ర మట్టానికి దాదాపు 11,500 అడుగుల ఎత్తులో ట్రయల్స్ నిర్వహిస్తుండడం దీని ప్రత్యేకత.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News