Saturday, April 27, 2024

మురిపిస్తున్న ఓబులమ్మ…

- Advertisement -
- Advertisement -

Obulamma song release from Kondapolam

 

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్, – రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘కొండ పొలం’. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో గ్రామీణ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో కటారు రవీంద్ర యాదవ్‌గా వైష్ణవ్,- ఓబులమ్మగా రకుల్ నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రంలోని ‘ఓబులమ్మ’ అనే పాట ఫుల్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ గీతానికి ఎంఎం కీరవాణి బాణీలు సమకూర్చడమే కాకుండా.. సాహిత్యం అందించడం విశేషం. కీరవాణి బ్యూటిఫుల్ కంపోజిషన్‌లో వచ్చిన ఈ పాటలో ఫ్లూట్ బిట్స్ అదనపు ఆకర్షణగా నిలిచింది.

ఈ పాటకు రాయలసీమ యాసలో అందమైన సాహిత్యాన్ని అందించారు కీరవాణి. సత్య యామి, పివిఎన్‌ఎస్ రోహిత్ కలిసి ఈ సోల్‌ఫుల్ మెలోడీ సాంగ్‌ను అద్భుతంగా ఆలపించారు. ఈ పాటలో పల్లెటూరి నేపథ్యానికి తగ్గట్టుగా వైష్ణవ్ తేజ్, – రకుల్‌ప్రీత్ సింగ్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. బిబో శ్రీనివాస్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాయిబాబు జాగర్లమూడి, – రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.

https://youtu.be/JiqIa5uzYGk

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News