Sunday, April 28, 2024

రాంచీలో ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -
Protest in Ranchi
పవక్త(స)పై వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అల్లర్లు
ఇటీవల కొందరు ప్రవక్త(స)కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యూపీకి చెందిన ప్రయాగ్‌రాజ్, పశ్చిమబెంగాల్‌కు చెందిన హౌరా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, బీహార్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. శ్రీనగర్‌లో కూడా బంద్ పాటించడం జరిగింది.

న్యూఢిల్లీ: జార్ఖండ్‌కు చెందిన రాంచీలో రాళ్లు రువ్వుతున్న నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు. ప్రవక్త(స)ను కించపరిచే విధంగా బిజెపి మాజీ ప్రతినిధులు నూపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, పశ్చిమబెంగాల్‌కు చెందిన హౌరాలో నిరసనలు హింసాత్మకంగా మారాయి. కాగా ఢిల్లీ, మధ్యప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, బీహార్, మహారాష్ట్రలలో జరిగిన నిరసనలు శాంతియుతంగా జరిగాయి. శ్రీనగర్‌లో బంద్ పాటించడం జరిగింది. ఢిల్లీలో షాహి ఇమామ్ నిరసనలకు దూరంగా ఉన్నారు. పైగా ఆయన రాజీకి పిలుపునిచ్చారు. కాగా టివి చర్చల్లో పాల్గొనొద్దని ఇస్లామీయ మేధావులు, పండితులకు ముస్లిం పర్సనల్ లా బోర్డు విజ్ఞప్తి చేసింది. టివి చర్చలు ఇస్లాంను, ముస్లింలను కించపరిచే ఉద్దేశ్యంతో నడిపిస్తున్నట్లు కూడా పేర్కొంది. టివి చర్చల సందర్భంలోనే బిజెపి మాజీ ప్రతినిధి నూపుర్ శర్మ వివాదస్పద వ్యాఖ్యలు చేశారన్నది ఇక్కడ గమనార్హం. నూపుర్ శర్మ, జిందాల్ చేసిన వ్యాఖ్యలపై గల్ప్ దేశాలు సహా అనేక దేశాలు నిరసన వ్యక్తం చేశాయి. వారు చేసిన వ్యాఖ్యల అనంతరం ఆందోళనలు కూడా చెలరేగాయి. ఇదిలావుండగా వారి వ్యాఖ్యలు ప్రభుత్వ భావాలను ప్రతిబింబించదని భారత్ ఇస్లామీయ దేశాలకు స్పష్టం చేసింది. అంతేకాదు నూపుర్ శర్మ, జిందాల్‌లను బిజెపి పార్టీ నుంచి బహిష్కరించింది కూడా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News