Sunday, May 5, 2024

వన్ టైం సెటిల్‌మెంట్

- Advertisement -
- Advertisement -

 ఆస్తి పన్ను బకాయిల చెల్లింపునకు మరో అవకాశం

 90 శాతం వడ్డీ డిస్కౌంట్, ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు గడువు విధింపు
 జిహెచ్‌ఎంసి సహా పట్టణాల్లోని పన్ను చెల్లింపుదారులకు కొత్త స్కీమ్ వర్తింపు
 పురపాలక మంత్రి కెటిఆర్ సూచనల మేరకు ఆదేశాలు జారీ

మన తెలంగాణ/హైదరాబాద్: ఆస్తిపన్ను చెల్లింపు దారులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. గత ఆర్ధిక సంవత్సరాని (2019-2020)కి సంబంధించిన ఆస్తిపన్నును కేవలం 10శాతం వడ్డితో చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 90 శాతం వడ్డీని డిస్కౌంట్ పొందేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు వన్ టైమ్ సెటిల్ మెంట్ స్కీంను తీసుకొస్తూ మంగళవారం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందు లో భాగంగా ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేందుకు మరోసారి అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో జిహెచ్‌ఎంసి, పట్టణాల్లోని పన్ను చెల్లింపుదారులు గత ఆర్ధిక సంవత్సరానికి చెందిన ఆస్తి పన్ను మొత్తాన్ని 10 శాతం వడ్డీతో చెల్లిస్తే.. తరువాయి 8లో 90 శాతం వడ్డీ మాఫీ చేస్తామని ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది. అయితే ఈ అవకాశం కేవలం 45 రోజులు పాటు (ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15) మాత్రమే కల్పించారు. భారీగా పేరుకుపోయిన ఆస్తిపన్ను బకాయిదారులకు ఇది మంచి అవకాశం లభించినట్లు అయింది. ప్రస్తుతం జిహెచ్‌ఎంసి పరిధిలో 5.64లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉండగా.. ఇప్పటి వరకు రూ.1477.86 బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పురపాలక శాఖా మంత్రి కెటిఆర్ సూచన మేరకు ఆ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

One Time Amnesty Scheme for property tax payers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News