Saturday, May 4, 2024

మహమ్మారి బారిన మధ్యవయస్కులు

- Advertisement -
- Advertisement -

15839 టెస్టులు..1610 పాజిటివ్‌లు
జిల్లాల్లో 1079, జిహెచ్‌ఎంసిలో 531 మందికి వైరస్
వైరస్ దాడిలో మరో 9 మంది మృతి
57,142కు చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య

31 నుంచి 40 మధ్య వయస్కుల్లో 25 శాతం పాజిటివ్‌లు..

1610 New Corona Cases Reported in Telangana

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 31 నుంచి 40 మధ్య వయస్సు వారు అత్యధికంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. వైరస్ సోకిన వారిలో ఏకంగా 25 శాతం మంది ఈ ఏజ్ గ్రూప్ నుంచే ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ తర్వాత స్థానంలో 21 నుంచి 30 వయస్సు వారు 22.1 శాతం, 41నుంచి 50 మధ్య వయస్సు వారు 18.6 శాతం 51 నుంచి 60 మధ్య 14.7, 61 నుంచి 70 మధ్యలో 7.7, 11 నుంచి 20 మధ్య వయస్సులో 5.3, 71 నుంచి 80 మధ్యలో 2.6, పది సంవత్సరలోపు 3.4, 81 సంవత్సరాల పై బడిన వారు 0.6 శాతం మందికి వైరస్ సోకిందని అధికారులు వెల్లడించారు. వీరిలో 65.6 శాతం మంది పురుషులు ఉండగా, 34.4 శాతం మంది స్త్రీలు ఉన్నారు. అదే విధంగా ఇప్పటి వరకు వైరస్ దాడిలో 53.87 శాతం మంది కో మార్పిడ్(వైరస్ సోకకముందు దీర్ఘకాలిక, ఇతర రోగాలు ఉన్న వారు) కండిషన్‌తో చనిపోగా, 46.13 శాతం మంది కేవలం వైరస్ దాడితో చనిపోయినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.

రాష్ట్రంలో కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తుంది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 15,839 మందికి టెస్టులు నిర్వహిస్తే 1610 పాజిటివ్‌లు తేలాయని, 809 మంది రిపోర్టులు ఫెండింగ్‌లో ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. కొత్తగా వైరస్ సోకిన వారిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 531 ఉండగా, ఆదిలాబాద్‌లో 13, భద్రాది 16,జగిత్యాల 12, జనగాం 18, భూపాలపల్లి 20,గద్వాల 34, కామారెడ్డి 18,కరీంనగర్ 48, ఖమ్మం 26, మహబూబ్‌నగర్ 23, మహబూబాబాద్ 14, మంచిర్యాల 13, మెదక్ 12, మేడ్చల్ మల్కాజ్‌గిరి 113, ములుగు 32, నాగర్‌కర్నూల్ 9, నల్గొండ26, నారాయణపేట్ 14, నిజామాబాద్ 58, పెద్దపల్లి 48, సిరిసిల్లా 14, రంగారెడ్డి 172, సంగారెడ్డి 74, సిద్ధిపేట్ 14, సూర్యాపేట్ 35, వికారాబాద్ 11,వనపర్తి 3, వరంగల్ రూరల్ 25, వరంగల్ అర్బన్ లో 152, యాదాద్రిలో మరో 12 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అదే విధంగా వైరస్ దాడిలో మరో తొమ్మిది మంది చనిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 57,142కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 42,909కి చేరింది. ప్రస్తుతం ప్రభుత్వం పర్యవేక్షణలో 13,753మంది చికిత్స పొందుతుండగా, వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 480 పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16 కేంద్రాల్లో ఆర్‌టిసిపిఆర్, 320 సెంటర్లలో టెస్టులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. దీంతో పాటు మరో 23 ప్రైవేట్ ల్యాబ్‌లలోనూ పరీక్షలు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు.

వయస్సు వారీగా పాజిటివ్‌లు (శాతంలో)
వయస్సు          మొత్తం   పురుషులు    స్త్రీలు
1-0 ఏళ్ల లోపు     3.4        1.9       1.5
11-20             5.3        2.8       2.4
21-30             22.1      14.1      7.9
31-40             25.0      17.7      7.3
41-50            18.6       12.5      6.2
51-60            14.7       9.5        5.2
61-70            7.7         5.0        5.2
71-80            2.6         1.7        0.9
80 ఏళ్ల పైబడిన వారు 0.6     0.4        0.2
మొత్తం             100         65.6     34.4

1610 New Corona Cases Reported in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News