Tuesday, May 7, 2024

ఊటీ ట్రిప్ కు కేవలం రూ. 13 వేలే !

- Advertisement -
- Advertisement -

ఐఆర్సిటిసి టూర్ ప్యాకేజీ

హైదరాబాద్: వేసవి వేడిమిని తట్టుకోలేక చాలా మంది వేసవి కాలంలో చల్లని విడుదలకు వెళ్లాలని అనుకుంటారు. పేదలకైతే సాధ్యం కాదు కానీ, కాస్త వెసలుబాటు ఉన్నవారికి ఇది సాధ్యమే. సాధారణంగా చాలా మంది సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి ప్రాంతాలకు ట్రిప్ వేస్తుంటారు. కాగా ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్ సిటిసి) ఓ బెస్ట్ ప్యాకేజీని తీసుకొచ్చింది. దాని ప్రకారం ప్రయాణం,భోజనంతో పాటు వసతి ఉండనున్నది. ఊటీలో సుందరమైన ప్రాంతాలను ఎంజాయ్ చేయొచ్చు.

ఊటీని ‘హిల్ స్టేషన్ క్వీన్’ అంటారు. నీలగిరి జిల్లా రాజధాని ఊటీ. దక్షిణ భారత దేశంలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. నీలగిరి పర్వతాల్లో రైలు ప్రయాణం అదనపు ఆకర్షణ.  ఊటీ ప్రదేశం సముద్ర మట్టానికి 2240 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఐఆర్ సిటిసి అందించే తాజా టూర్ ప్యాకేజీ ఏప్రిల్ 9 నుంచి మే 28 వరకు అందుబాటులో ఉండనున్నది. ‘అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్’(Ultimate Ooty X Hyderabad) పేరిట ఈ టూర్ ప్యాకేజీ అందిస్తున్నారు. సికింద్రాబాద్, గుంటూరు, నల్గొండ, తెనాలి రైల్వే స్టేషన్లలో యాత్రికులు ఈ రైలు ఎక్కొచ్చు.  సమయం తక్కువ కనుక వెంటనే ఆఫర్ ను వినియోగించుకోండి ! ఏప్రిల్ 9కి సంబంధించిన టికెట్లు అమ్ముడయిపోయాయి. ఇక మిగిలింది ఏప్రిల్ 16,23,30 మే14,21,28 తేదీలవి మాత్రం అందుబాటులో ఉన్నాయి.

Ooty

Ooty Botanical Garden

Ooty train

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News