Tuesday, May 21, 2024

మరో పదేళ్లపాటు యూజిసీ హోదాను దక్కించుకున్న ఓయూ ఇంజనీరింగ్ కళాశాల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల మరో మైలురాయిని అధిగమించింది. ఒకేసారి ఏకంగా మరో పదేళ్లపాటు యూజిసీ స్వయం ప్రతిపత్తి హోదాను సాధించి చరిత్ర సృష్టించింది. 1929లో స్ధాపించిన ఈ కళాశాలకు గతంలో రెండుసార్లు ఆరేళ్ల చొప్పున అటానమస్ గుర్తింపు దక్కింది. తాజాగా మూడోసారి ఒకేసారి పదేళ్ల గుర్తింపు దక్కించుకుంది. ఈమేరకు యూజీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఓయూకు న్యాక్ ఏ ప్లస్ గుర్తింపు ఉండటం, ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న అన్ని విభాగాలకు నేషనల్ బోర్డ్ ఆప్ అక్రిడిటేషన్ గుర్తింపు సాధించడం లాంటి అంశాలను యూజీసీ పరిగణలోకి తీసుకుంది. దీంతో ఓయూ ఇంజినీరింగ్ కళాశాలలను సందర్శించకుండానే పదేళ్లపాటు స్వయం ప్రతిపత్తి హోదాను కల్పిస్తూ యూజీసీ నిర్ణయం తీసుకుంది.

ఫలితంగా 2022-23 నుంచి 2031-32 వరకు స్వయం ప్రతిపత్తి అమల్లో ఉంటుంది. ఇంత సుదీర్ఘకాలం పాటు అటానమస్ హోదా కలిగిన కళాశాలలకు దక్కిన ఈ హోదాతో కోర్సులు, సిలబస్ రూపకల్పన అంశాల్లో స్వేచ్చ ఉంటుందని, పరిశోధనా ప్రాజెక్టుల్లోనూ ప్రాధాన్యత ఉంటుందని ఓయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొపెసర్ శ్రీరాం వెంకటేష్ అభిప్రాయ పడ్డారు. ఇంజినీరింగ్ కళాశాలలో మౌలిక వసతుల కల్పన కోసం ఇటీవలే పనులు ప్రారంభించడంతో పాటు అధునిక కోర్సులు అందుబాటులో తీసుకొచ్చామన్న ఓయూ కులపతి ప్రొపెసర్ దండెబోయిన రవింందర్ యాదవ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మినారాయణ, ఏకబిగిన పదేళ్ల పాటు స్వయం ప్రతిపత్తి హోదా దక్కటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News