Monday, May 6, 2024

మన ఊరు మన బడి కార్యక్రమం దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ సిటీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి మన బస్తీ కార్యక్రమం దేశానికే ఆదర్శమని, విద్యార్థులంతా సిఎం కెసిఆర్‌కు ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలపడం అభినందనీయమని అర్బర్ ఎంఎల్‌ఏ బిగాల గణేష్ గుప్తా అన్నారు. మంగళవారం నగరంలోని ఎల్లమ్యగుట్టలో రూ. 25.58 లక్షలతో ప్రాథమిక పాఠశాల, వినాయక్‌నగర్‌లో రూ. 30.81 లక్షలతో పాఠశాల, వెంగల్‌రావు నగర్‌లోని ఉన్నత పాఠశాల కోసం రూ. 583.20 లక్షలతో నిర్మించిన పాఠశాలల భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం కెసిఆర్ నాయకత్వంలో విద్యాశాఖ ప్రగతిపథంలో ముందుకు వెళుతోందన్నారు.

మన ఊరు మన బడి, మన బస్తీ కార్యక్రమం ద్వారా సరికొత్త హంగులతో ప్రభుత్వ బడులు స్వాగతం పలుకుతున్నాయన్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన, సైన్స్ ప్రయోగాలు, డిజిటల్ వనరులతో కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ బడుల్లో విద్యను అందిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సన్నబియ్యంతో అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాలకు రాష్టంలో దాదాపు రూ. 7250 కోట్లు ఖర్చుపెడుతోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తమకు అందుబాటులోవస్తున్న వనరులను ఉపయోగించుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరారు.

మన ఊరు, మన బడి పథకాన్ని తీసుకొచ్చి కోట్లాది రూపాయలతో బడులను బాగు చేసిన ఏకైక సిఎం కెసిఆర్ అన్నారు. ఒకప్పుడు ప్రభ్వుత్వ బడులకు పంపాలంటే బయపడే తల్లిదండ్రులు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించటానికి పోటీ పడుతున్నారన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలకు లక్షలాది రూపాయలు కేటాయించి విద్యార్థులకు ఏ సమస్య రాకుండా చూస్తుందన్నారు.

విద్యార్థుల భవిష్యత్‌కు మొదటి ప్రాధాన్యత ఇస్తూ గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలను అందుబాటులోకి తీసుకొచ్చి వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తుందన్నారు. దీంతో పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో కూడా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ర్యాంకులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్; నుడా ఛైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు, కార్పొరేటర్లు నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News