Saturday, April 27, 2024

పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలి

- Advertisement -
- Advertisement -

హసన్‌పర్తి: పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలని, వారి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేశ్ అన్నారు. ఆదివారం హసన్‌పర్తి పద్మశాలి సేవా సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలు అభివృద్ధి చెందాలని అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. పద్మశాలి మినీ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి, స్మశాన వాటిక అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రూ. 2 కోట్లతో ఉమ్మడి స్మశాన వాటిక అభివృద్ధి జరుగుతుందని, త్వరలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, డివైడర్‌ను ఏర్పాటుచేస్తామన్నారు.

అనంతరం నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. పద్మశాలీలకు గృహలక్ష్మి పథకంలో ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. టెక్స్‌టైల్ పార్కులోని కీ టెక్స్ కంపెనీలో పద్మశాలి మహిళలకు అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఇందు కోసం మహిళలకు ఉచితంగా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. తద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారన్నారు. పద్మశాలీలు ఐకమత్యంతో అభివృద్ధి చెందాలన్నారు. అనంతరం నూతన కమిటీచే ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రేణిగుంట్ల సునీత, 66వ డివిజన్ కార్పోరేటర్ గురుమూర్తి శివకుమార్, డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్, మండలాధ్యక్షుడు బండి రజనీకుమార్, మాజీ ఎంపీటీసీ పిట్టల కుమారస్వామి, మార్కెట్ డైరెక్టర్లు రాజేశ్వర్‌రావు, సురేందర్‌రెడ్డి, డివిజన్ యూత్ అధ్యక్షుడు వల్లాల శ్రీకాంత్‌గౌడ్, పద్మశాలి సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండు ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు దీకొండ బిక్షపతి, నూతన అధ్యక్షుడు కేదాసి రాకేష్, గౌరవ అధ్యక్షుడు మాటేటి రవీందర్, సలహాదారుడు కేదాసి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శ గడ్డం వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు తలకొక్కుల సుభాష్, కోశాధికారి మాటేటి దీప్‌రాజ్, సంయుక్త కార్యదర్శి మాటేటి కుమారస్వామి, సభ్యులు శ్రీనివాస్, సారంగపాణి, రాజు, రవీందర్, మార్కండేయ దేవాలయ కమిటీ అధ్యక్షుడు సట్కూరి సంతోష్‌రాజ్, పరపతి సంఘం అధ్యక్షుడు చేరాల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News