Saturday, May 4, 2024

కావాలనే నాపై ఐటి దాడులు చేయించారు: ఎమ్మెల్యే ఫైళ్ల

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి ప్రతినిధి: బిజెపి కేంద్ర ప్రభుత్వం తనపై కావాలనే ఐటి దాడులు చేయించారని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మండిపడ్డారు. శనివారం హైదరాబాద్ కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలో ఆయన నివాసంలో పైళ్ల మీడియాతో మాట్లాడారు. సోదాలు చేపట్టిన ఐటి అధికారులకు అన్ని రకాలుగా సహకరించామన్నారు. వాళ్ళు వచ్చిన రోజు బుధవారం రోజు గంటన్నరలోపే పూర్తి వివరాలు ఇచ్చినట్లు తెలిపారు. అయినా మూడురోజులు ఏదో సాధించాలని కాలయాపన చేశారని విమర్శించారు. నోటీసులు ఇచ్చి వెళ్లారని… మళ్ళీ అవసరమైతే రావాలని చెప్పారని అన్నారు. రియల్ ఎస్టేట్, డెవలపింగ్ తప్ప ఏ వ్యాపారాలు తనకు లేవన్నారు. బ్యాంక్ లాకర్లు తెరిచారన్నారు. తనపై మీడియాలో వచ్చేవి అబద్ధాలని… తాను కొన్న ఆస్తులపై వివరాలు తీసుకున్నారని శేఖర్ రెడ్డి తెలిపారు.

Also Read: బిఆర్ఎస్ పార్టీ నేతల ఇళ్లపై ముగిసిన ఐటి సోదాలు…..

ఏదో ఊహించుకుని ఐటి అధికారులు వచ్చారు… కానీ ఏమీ దొరకలేదన్నారు. ఐటి అధికారులకు తమ సిఎ పూర్తి వివరాలు ఇచ్చారన్నారు. మంగళవారం రోజు రమ్మని నోటీసుల్లో తెలిపారని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాగా 1998 నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని.. తనకు ఎలాంటి మైనింగ్ వ్యాపారాలు లేవని, ఐటి అధికారులకు వారికి అనుకూలమైన సమాచారం రాకపోవడంతో నిరుత్సాహంతో వెనుతిరిగారన్నారు. విచారణలో భాగంగా ఎప్పుడు పిలిచినా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నాకోసం మూడు రోజులుగా ఉన్న కార్యకర్తలకు, నాయకులకు అందరికి ధన్యవాదాలు’’ అని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News