Sunday, April 28, 2024

19వ శతాబ్దం నాటి సిక్కు గురుద్వార పునరుద్ధరణకు పాక్ ప్రభుత్వ నిర్ణయం

- Advertisement -
- Advertisement -

Pakistan govt to restore 19th century Sikh temple

 

పేషావర్: పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రొవిన్షియల్ ప్రభుత్వం సిక్కు పాలకుడు హరి సింగ్ నల్వా పాలనలో నిర్మించిన 19వ శతాబ్దం నాటి గురుద్వారను పునరుద్ధరించి, భక్తుల సందర్శనార్థం తెరవాలని నిర్ణయించింది. మనేహ్రా జిల్లాలోని ఈ సిక్కు ఆలయం ప్రస్తుతం మూతపడింది. తాత్కాలికంగా దీన్ని లైబ్రరీగా వాడుతున్నట్లు అధికారులు చెప్పారు. ఈ గురుద్వారను సందర్శించడానికి ప్రపంచవ్యాప్తంగా సిక్కు భక్తులు ఆసక్తి కనబరుస్తుండడంతో మతపరమైన పర్యాటక కేంద్రంగా ఈ గురుద్వారను అభివృద్ధి చేయాలని ప్రాంతీయ ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ గురుద్వార పునరుద్ధరణకు సంబంధించి ప్రొవిన్షియల్ ప్రభుత్వానికి చెందిన ఔఖఫ్, మత వ్యవహారాల శాఖ స్థానిక ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఈ ప్రాంగణంలో ఉన్న లైబ్రరీని ఖాళీ చేయవలసిందిగా ఎవక్యూస్ ప్రాపర్టీ ట్రస్టు బోర్డు స్థానిక ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, ఈ నిర్ణయాన్ని పాకిస్తాన్ సిక్కు గురుద్వార ప్రబంధక్ కమిటీ స్వాగతించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News